విశాఖలో షెడ్ కూలి ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

విశాఖలో షెడ్ కూలి ఇద్దరు మృతి

Published Wed, Mar 25 2015 3:31 PM

Two died in shelter collapse at visakhapatnam

విశాఖపట్నం: విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ సమీపంలో షెడ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు కాంట్రాక్ట్ వర్కర్ రాకేష్ కుమార్, సెయిలర్ రాజేంద్రకుమార్, గాయపడిన వ్యక్తి సెయిలర్ జుబేకర్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement