సిమెంట్ లారీ దొంగల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

సిమెంట్ లారీ దొంగల అరెస్ట్

Published Tue, Sep 22 2015 6:52 PM

Two thieves arrested

గోరంట్ల (అనంతపురం) : ఓ సిమెంట్ లారీని కొట్టేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14 న గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీతో దొంగలు పరారయ్యారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. లారీని దొంగిలించిన చౌడప్ప, మహేశ్‌లను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement