ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్

Published Wed, Jan 1 2014 5:18 AM

Two wheeler thieves gang arrested

భద్రాచలం, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ ముఠాను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.70లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం భద్రాచలం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. భద్రాచలం ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీ చేస్తుం డగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొన్ని వాహనాలు పట్టుబడ్డాయి. ఈ వాహనాలు వినియోగిస్తున్న వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. తొలుత తాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దొంగల ముఠా వివరాలు తెలిశాయి.
 
 భద్రాచలం మండలంలోని పాలమడుగు గ్రామానికి చెందిన తాటి నాగేశ్వరరావు బోర్‌వెల్ పనుల కోసం నల్లగొండ జిల్లాకు వెళ్లగా నల్లగొండకు చెందిన రాచూరి సతీష్, అదే జిల్లా మిర్యాలగూడేనికి చెందిన కారు డ్రైవర్ తీగల శ్రీకర్‌రావుతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి ఏడాది కాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నారు. సతీష్ డూప్లికేట్ తాళలు తయారు చేయగా వారు ద్విచక్ర వాహనాలు చోరీ చేసి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇలా వీరు భద్రాచలం, మణుగూరు, ఎల్‌బీనగర్, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. ఎల్‌బీ నగర్, మిర్యాలగూడ వాహనాలను భద్రాచలం ప్రాంతంలో, ఇక్కడి వాహనాలను మిర్యాలగూడెంలో విక్రయించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక దృష్టి సారించిన ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సహకరించిన ఏఎస్సై లక్ష్మణ్, ఐడీ పార్టీ సిబ్బంది డానియేల్, సూర్యం, కామేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనులకు తగిన ప్రోత్సాహకం అం దించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాస రెడ్డి, భోజరాజు, ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సై రామారావు ఉన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement