పోలీసు విభజనపై ఢిల్లీ వెళ్లిన డీజీ బృందం | Sakshi
Sakshi News home page

పోలీసు విభజనపై ఢిల్లీ వెళ్లిన డీజీ బృందం

Published Wed, Dec 25 2013 2:26 AM

union home ministry advisor vijay kumar meeting on telangana

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసు సిబ్బందితోపాటు గ్రేహౌండ్స్, బెటాలియన్స్, ఎసీబీ, అప్పా, నిఘా విభాగాలను రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలనే అంశంపై మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రా ష్ట్రం నుంచి డీజీ నాయకత్వంలోని పోలీసు అధికారుల బృందం హాజరైంది.

ఈ విభాగాల పంపిణీతోపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ ఎలా ఉండాలనే దానిపై విజ య్‌కుమార్ సమక్షంలో చర్చించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాలనా అంశాలను ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న వ్యక్తి చూస్తారని బిల్లులో పేర్కొన్న విషయం తెలిసిందే.

అలాగే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసించే ఇతర ప్రాంతాల ప్రజలు, ఆస్తుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? పాలనాపరం గా ఎలాంటి యంత్రాం గాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై  చర్చించారు. ఈ మేరకు ఆయా అంశాలపై విజయ్‌కుమార్ చేసిన సూచనల మేరకు రాష్ర్ట పోలీసు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ వివరాలను అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం, మంత్రులకు వివరించనున్నట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
 

Advertisement
Advertisement