అలుపెరగని పోరు | Sakshi
Sakshi News home page

అలుపెరగని పోరు

Published Sun, Aug 25 2013 6:48 AM

united andhra movement

 సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో సింహపురి వా సులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ మెడలు వం చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిరసన కార్యక్రమాలతో జిల్లా ను హోరెత్తిస్తున్నారు. 25వ రోజు ఉద్యమాన్ని శనివారం ఉధృతంగా కొనసాగించారు. నెల్లూరులోని కనకమహల్ సెంటర్‌లో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు రాస్తారోకో చేయగా, విద్యుత్ శా ఖ ఉద్యోగులు  రిలేదీక్షలు చేశారు. ఎన్జీఓలు, విద్యాశాఖ మినీస్టీరియల్ సిబ్బం ది, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో   మ హాప్రదర్శన నిర్వహించారు. గెజిటెడ్ ఆ ఫీసర్లు, ఉద్యోగ సంఘాల ఉద్యమ కా ర్యాచరణను ఏజేసీ పెంచలరెడ్డి ప్రకటించారు.  నారాయణరెడ్డిపేట, కొత్తకాలువ సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమాలకు టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర హాజరయ్యారు.
 
  ముత్తుకూరులో రాస్తారోకో, ఏపీ జె న్‌కో ప్రాజెక్టులో ఉద్యోగులు ధర్నా చేశా రు. టీపీగూడూరులో విద్యార్థులు మా నవహారం నిర్వహించారు. సాలిపేట సెంటర్‌లో మోకాళ్లపై నిలుచుని నిరస న తెలిపారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైవేపై వెంకటాచలం వద్ద వంటావార్పు చేపట్టారు.
 
  విజయమ్మ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గూడూరులో బంద్ జరిగింది. కా శీపేట, రాజావీధి, ఆర్టీసీ సెంటర్లలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛం దంగా మూసేశారు.  ఆర్టీసీ బస్టాండ్, పాతబస్టాండ్ సెంటర్లలో ర్యాలీలు, రా స్తారోకోలు జరిగాయి. వెంకటగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అన్ని శాఖల సిబ్బంది రిలేదీక్షలు చేపట్టారు. వారికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు.
 
  ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వరికుంటపాడులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు  వం టా వార్పు నిర్వహించారు. కలిగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గ్రంథాలయం సమీపం లో రిలేదీక్షలు చేపట్టారు. కొండాపురం లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారో కో జరిగింది.
 
  చిల్లకూరులో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. టోల్‌ప్లాజా ఉద్యోగులు నిరసనను రెండో రోజు కొనసాగించా రు. వాకాడులో ధర్నా నిర్వహించారు. కోట మండలం కొత్తపాళెం, కొక్కుపాడుతో పాటు చిట్టమూరులోనూ ర్యాలీలు జరిగాయి.
 
  సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నా యి. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ముస్లిం యువకులు రిలే నిరాహారదీ క్షలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 10 బస్సులతో ర్యాలీ నిర్వహించారు.  జేఏసీ, వైఎస్సార్‌సీపీ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నా యి. యువకులు చేస్తున్న ఆమరణ ని రాహారదీక్షను పోలీసులు భగ్నం చేశా రు. వైఎస్సార్‌సీపీ తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమి టీ సభ్యుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష ప్రారంభమైంది. దీక్ష లో ఉన్న వారికి పార్టీ సమన్వయకర్తలు నెలవల సుబ్రమణ్యం, కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు.
 
  ఆత్మకూరు మున్సిపల్ బస్టాండులో మహిళలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది.  కావలిలోని పొట్టిశ్రీరాములుబొమ్మ సెంటర్ వద్ద రిలే దీక్షలో ఉన్నవారికి వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఏరియా వైద్యశాల సెంటర్లో సమైక్యాంధ్ర పరిరక్షణసమితి ఆధ్వర్యంలో దీక్షలో ఉన్న వారికి టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర సంఘీభావం ప్రకటించారు.

Advertisement
Advertisement