భారీ నష్టం మిగులుస్తున్న అకాల వర్షాలు | Sakshi
Sakshi News home page

భారీ నష్టం మిగులుస్తున్న అకాల వర్షాలు

Published Sun, May 3 2015 9:51 AM

untimely rains in andhrapradesh

నెల్లూరు : అకాల వర్షాలతో అన్నదాతకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవిలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం ఆంధ్రపదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మండల పరధిలోని పలు గ్రామాల్లో ఉన్న నిమ్మ, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని కాకివాయి, వాగిలేరు, మడిచర్ల తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో పాటు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ధర్మవరంలో వడగళ్ల వాన:
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం కురిసిన వడగళ్ల వాన అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ వడగళ్ల వానతో మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు, పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మండల పరిధిలోని పోతుకుంట వద్ద ఉన్న 2హెచ్‌టీ విద్యుత్ టవర్ కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement