‘యురేనియం’ గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన | Sakshi
Sakshi News home page

‘యురేనియం’ గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన

Published Sat, Sep 7 2019 12:10 PM

Uranium Mining Pollution:panel to inspect on September 9 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నియమించిన నిపుణుల కమిటీ ఈ నెల 9, 10 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లా వేముల మండలంలోని యురే నియం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో పర్యటిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల వేల్పుల, మేడిపెంట్ల, కొట్టాల గ్రామాల్లో భూగర్భ జలమట్టం కలుషితమైందని, పంటలు పండటం లేదని, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయ డం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పీసీబీ నిపుణుల కమిటీని నియమించింది. 

ముంబైలోని అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు న్యూక్లియర్‌ ప్రాజెక్టు సేఫ్టీ డివిజన్‌ అధిపతి డాక్టర్‌ ఎల్‌ఆర్‌ బిష్ణోయ్, నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ–హైదరాబాద్‌) సీనియర్‌ ప్రిన్సి పల్‌ సైంటిస్టు డాక్టర్‌ ఈవీఎస్‌ఎస్‌కే బాబు, తిరుపతి ఐఐటీ సివిల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సురేష్‌ జైన్, డాక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ సంపత్, డాక్టర్‌ శిభాబుద్దీన్, ఆంధ్రా వర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (విశాఖపట్నం) జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎం.జగన్నాథరావు, ఆంధ్రా వర్సిటీ ఫిజికల్‌ కెమిస్ట్రీ, న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, కెమికల్‌ ఓషనోగ్రఫి విభాగాల అధిపతి డాక్టర్‌ పి.శ్యామల, రాష్ట్ర భూగర్భ జలాలు, గనులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉప సంచాలకులు బి.నాగేశ్వరరావు, సి.మోహన్‌రావు, బాలూనాయక్, డి.మధుసూదన్‌రెడ్డితో కూడిన బృందం ఈ నెల 9, 10 తేదీల్లో ఆయా గ్రామాల్లో పర్యటిస్తుంది. భూగర్భ జలంపై యురేనియం ప్రాజెక్టుకు చెందిన టెయిలింగ్‌ పాండ్‌ ప్రభా వం, ఇక్కడ భూమిలోని నీటిలో రేడియో యాక్టివిటీ, వ్యవ సాయ, ఉద్యాన పంటలపై ప్రభావం, ఇతర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి ఈ నెల 11వ తేదీన పీసీబీకి సమగ్రమైన నివేదిక ఇస్తుంది.  

Advertisement
Advertisement