ప్రగతికి సార్థకత | Sakshi
Sakshi News home page

ప్రగతికి సార్థకత

Published Mon, Feb 17 2014 4:17 AM

Usefulness progress

మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: గుజరాత్‌లో రెండువేల మందికిపైగా అమాయకులైన మైనార్టీలను ఊచకోతకోయడమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేసిన అభివృద్ధా..అని ప్రముఖ సామాజిక తత్వవేత్త స్వామి అగ్నివేశ్ ప్రశ్నించారు. విద్వేషాలను రెచ్చగొట్టి గద్దెనెక్కాలని కుట్రలుపన్నుతున్న మతోన్మాదులకు అధికారం ఇవ్వొద్దని కోరారు. పేదల ఆకలిబాధ తీరితేనే ప్రగతికి సార్థకత చేకూరుతుందన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని మునిసిపల్ టౌన్‌హాల్ ఆవరణలో లౌకిక ప్రజాతంత్ర పరిరక్షణ వేదిక అధ్వర్యంలో జరిగిన మతోన్మాద వ్యతిరేక బహిరంగసభలో ప్రసంగించారు.
 
 కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, పౌరహక్కుల నేత హరగోపాల్ , టీపీఎఫ్ ఉపాధ్యక్షులు వేదకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ.. హిందూమతాన్ని అడ్డుపెట్టుకొని దేశంలోని అల్పసంఖ్యాకులను ఊచకోత కోయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. భగవద్గీత, రామాయణం, మహాభారతాల్లో ఎక్కడా హిందూ పదం లేదన్నారు. వేదాల్లో పలుసార్లు ‘మనుర్భవ ’ అనే పదాన్ని వాడారని.. అంటే దానర్థం మానవత్వమని వివరించి చెప్పారు.
 
 హిందూత్వాన్ని పెంచిపోస్తున్నాయి: నారాయణ
 అధికారంలోకి రావడానికి ఆర్‌ఎస్‌ఎస్, వీ హెచ్‌పీలు బీజేపీ అనే రాజకీయ ము సుగు తొడిగి హిందూత్వాన్ని పెంచిపోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ను ప్రయోగశాలగా మార్చి అమాయక ము స్లింలను ఊచకోతకోశారని, టీ.అమ్ముకునే వాడిని పీఎం చేద్దామ న్న నినాదంతో  దేశ వ్యాప్తంగా మారణహోమాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.
 
 పొఫెస ర్ హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో మతతత్వశక్తులు రజాకార్ల వ్యవస్థను బూచీ చూ పుతున్నాయని ధ్వజమెత్తారు. కానీ రజాకార్ల వెనక ఉన్న భూస్వామ్య మతోన్మాద చరిత్రను ప్రజలకు చెప్పడం లేదన్నారు. ని జాయతీని గురించి మాట్లాడుతున్న న రేం ద్రమోడీ 2002లో జరిగిన అల్లర్లకు బా ధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
 
 కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ (ఎన్‌డీ), టీసీపీఎం రాష్ట్ర నేతలు , వేములపల్లి వెంకట్‌రామయ్య, మహిమూ ద్, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అ లీఖాన్, రెవరెండ్ ఫాదర్ బాల సుబ్రహ్మణ్యం, లౌకిక  ప్రజాతంత్ర పరి రక్షణ వేదిక నాయకులు ఈర్ల నర్సింహా,  హనీఫ్, సీపీఎం జిల్లా కార్యదర్శి కిల్లె గో పాల్, మద్దిలే టి, కేజీ రాంచందర్   పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement