ఏడు కొండల వాడా.. ఎక్కడున్నావయ్యూ! | Sakshi
Sakshi News home page

ఏడు కొండల వాడా.. ఎక్కడున్నావయ్యూ!

Published Sun, Jan 12 2014 3:13 AM

Vaikunta Ekadasi

  • వీఐపీలకు భలే మంచి దర్శనం
  •  సామాన్యులకు అడుగడుగునా నరకం
  •  పట్టించుకునే వారే లేరు
  •  బస, దర్శనానికి నానా తిప్పలు
  •  బంధుగణం, కార్పొరేట్ సేవల్లో తరించిన ధర్మకర్తల మండలి
  •  భక్తులకు అరచేతిలో వైకుంఠం చూపిన టీటీడీ
  •  సాక్షి,తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు పడరాని పా ట్లు పడ్డారు. స్వామివారిని దర్శించుకునేందు కు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చారు. సు లభ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు ప్రకటించినా, వాస్తవ పరి స్థితులు అందుకు భిన్నంగా మారారుు. వీఐపీలకు మాత్రం అరగంట నుంచి గంట లోపే దర్శనం లభించింది.  

    సామాన్య భక్తులకు మా త్రం అరచేతిలోనే వైకుంఠం కనిపిచింది.  అడుగడుగునా నరకం అనుభవించారు. ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు, బైఠాయిం పుల పర్వం కొనసాగింది. శుక్రవారం మొదలైన డౌన్‌డౌన్ల పర్వం శనివారం కూడా కొనసాగిం ది. రద్దు చేసిన రూ.300 టికె ట్లను బోర్డు కోటా కింద కొందరికే కేటాయించడం ఎంత వరకు సబబు?అని భక్తులు మండిపడ్డారు. ఏకంగా చైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు బైఠారుుం చారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  

    శనివారం ఉదయం క్యూ లైన్లలో కూడా సామాన్య భక్తులు ఆందోళన చేశారు. తమను దర్శనానికి త్వరగా అనుమతించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల క్యూ నుంచి దాటి వచ్చేందుకు ప్ర యత్నించారు. ఏటా వీఐపీ భక్తులకు  దర్శనం, బస చాలా సులువవుతోంది. టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు  ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో వీఐపీలకు తిరుమలలో బస, దర్శనం హక్కుగా మారిపోతోంది. శని వారం ఏకంగా 8వేల వీఐపీ టికెట్లు కేటాయిం చారు. ఏడుగంటలపాటు దర్శనం చేయించి సాగనంపారు. సామాన్య భక్తులకు తిప్పలు త ప్పలేదు. కిక్కిరిసి క్యూలలో నరకయాతన అనుభవించారు. అయినా టీటీడీ అధికారుల్లో మాత్రం స్పందన అంతంతమాత్రమే.
     
    రాత్రంతా చలిలోనే భక్తుల కష్టాలు

     సామాన్య భక్తులను కదలిస్తే కష్టాల కన్నీళ్లు వస్తున్నాయి. శనివారం దర్శనం కోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచే భక్తులు క్యూ లైన్లనలో  పడిగాపులు కాచారు.  వారిని ఎక్కడి  క క్కడ టీటీడీ సిబ్బంది, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.  ఆ తర్వాత తమకు కేటాయించిన సమయానికి భక్తులు క్యూలోకి వెళ్లారు. తీవ్రమైన చలిలో, మంచులో భక్తులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు.  గదులు లభించని భక్తులు ఆరుబయటే చలిలో అవస్థ పడ్డారు. చంటి బిడ్డలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
     
    సొమ్మసిల్లి కింద పడిన భక్తుడు

     శనివారం ఉదయం  శ్రీవారి స్వర్ణరోథత్సం నే త్రపర్వంగా సాగింది. రథాన్ని లాగేందుకు జనం తోపులాడుకున్నారు. పడమర మాడ వీధిలోని చినజీయర్‌మఠం వద్ద  ఓ భక్తుడు రథాన్ని లాగుతూ   సొమ్మసిల్లి కింద పడిపోయారు. అ ప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని లేపడంతో ప్రమాదం తప్పింది. ఇదిమినహా రథోత్సవం వైభవంగా జరిగింది.
     

Advertisement
Advertisement