కాంగ్రెస్‌తో చేరేవాళ్లా సలహాలిచ్చేది?: వెంకయ్య | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో చేరేవాళ్లా సలహాలిచ్చేది?: వెంకయ్య

Published Thu, Dec 26 2013 2:33 AM

కాంగ్రెస్‌తో చేరేవాళ్లా సలహాలిచ్చేది?: వెంకయ్య - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో చేరేవాళ్లు సల హాలిస్తే ఎలా? అని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తమకు లేని పోని ఉచిత సలహాలు ఇచ్చే కన్నా వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటే మంచిదని సూచించారు. పూటకో మాట మార్చే టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించిన నేపథ్యంలో వెంకయ్య ఈ వ్యాఖ్య చేశారు. . కాంగ్రెస్ రహిత భారత్‌ను తమ పార్టీ కోరుకుంటోందన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి 89వ జన్మదినం సందర్భంగా బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నా యుడు మాట్లాడుతూ అభివృద్ధికి పెద్దపీట వేసిందే వాజ్‌పేయి అని కొనియాడారు. అవినీతికి అగ్రస్థానం కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత సోనియా, ప్రధాని మన్మో హన్ అని ధ్వజమెత్తారు.  అత్యవసర పరిస్థితి నాటికన్నా ప్రస్తుత పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. ఈ తరుణంలో నరేంద్రమోడీ ఓ వెలుగురేఖగా కనిపిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ వైపు రావడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని, తాము మాత్రం యువతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ‘రండి, బీజేపీలో చేరండి’ పేరిట ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మోడీకి ఓటుతో పాటు పది నుంచి వేయి రూపాయల వరకు నోటూ ఇవ్వాలని కోరుతూ మరో ప్రచారోద్యమాన్ని చేపడుతున్నామన్నారు. సేవాకార్యక్రమాలంటే వాజ్‌పేయికి చాలా ఇష్టమని చెబుతూ పార్టీ రాష్ట్ర శాఖ చేపట్టిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశంసించారు.

పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, వి.రామారావు, బి.వెంకటరెడ్డి, అరుణజ్యోతి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, డాక్టర్ మల్లారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 200 మంది మహిళలకు కుట్టు మిషన్లు, మరికొందరికి చీరలు పంపిణీ చేశారు. పలు ఆస్పత్రులలో రోగులకు పాలు, పండ్లు, అనాథలకు  దుప్పట్లు పంపిణీ చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement