గంగమ్మ మింగేసింది | Sakshi
Sakshi News home page

గంగమ్మ మింగేసింది

Published Tue, Jun 10 2014 12:40 AM

గంగమ్మ మింగేసింది - Sakshi

యలమంచిలి/మొగల్తూరు : హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలి సమీపంలోని నదివద్ద గల హైడ్రోపవర్ ప్రాజెక్ట్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో మరణించిన విద్యార్థినుల్లో ఒకరైన ఆకుల విజేత స్వగ్రామం యలమంచిలి మండలం కంచుస్తం భంపాలెం. ఈ గ్రామానికి చెందిన ఆకుల సూర్యకుమార్, పద్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఇరువురు కుమార్తెలు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లోనే ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చేస్తోంది. రెండో కుమార్తె విజేత  హైదరాబాద్‌లోని బాచుపల్లిలో వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజి నీరింగ్ కళాశాలలో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది.
 
 కంచుస్తంభంపాలెంకు చెందిన ఆమె తాత రంగారావు బీఈ ఎలక్ట్రికల్ చదివారు. విజయవాడలో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఆయన ఆ తరువాత మిలటరీలో మేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అనంతరం కంచుస్తంభంపాలెంలో సత్యసాయి ఆసుపత్రిని నెలకొల్పి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. రంగారావుకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె నందిత ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈమె భర్త కూడా మిలటరీలో పని చేస్తున్నారు.
 
 రెండో కుమార్తె ఉష. ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు సూర్యకుమార్. హైదరాబాద్‌లో ట్రాక్టర్ ఇంజినీరింగ్ వ్యాపారం చేస్తున్నారు. రంగారావు కంచుస్తంభంపాలెంలోనే ఉండటంతో వేసవి సెలవులు, బంధువుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే సందర్భాల్లో సూర్యకుమార్ కుటుంబ సభ్యులంతా ఇక్కడకు వస్తుంటారని సూర్యకుమార్ చిన్నాన్న కొడుకు ఆకుల సూర్యనారాయణ తెలిపారు. విజేత మరణించిందన్న సమాచారం తెలియడంతో ఆమె తాత రంగారావు సోమవారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విజేత మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
 
 ఇలా అవుతుందనుకోలేదు
 చదువు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తన అక్క మనుమరాలు ఆకుల విజేత నదిలో కొట్టుకుపోరుు మరణించడం తమ దురదృష్టమని ఆరేటి రాజా వాపోయూరు. విజేత బతికే ఉంటుందనుకున్నానని అన్నారు. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తన అక్క మనుమరాలు మరణించిందన్న విషయం తెలుసుకున్న ఆయన సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టడీ టూర్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలి ప్రాంతానికి వెళ్లిన విజేత నదిలో గల్లంత్యయిదని తెలిసి రాత్రంతా టీవీ చూస్తూ జాగారం చేశానని తెలిపారు. సూర్యకుమార్, పద్మ దంపతులకు కుమారులు లేరని, కుమార్తెలనే కొడుకులుగా చూసుకుంటున్నారని అన్నారు. వారికి ఉన్నత చదువులు చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు భగవంతుడు తీరని అన్యాయం చేశాడని కన్నీటి పర్యంతమయ్యారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement