మా చందాలతో బతికినోళ్లు | Sakshi
Sakshi News home page

మా చందాలతో బతికినోళ్లు

Published Thu, Mar 24 2016 4:12 AM

మా చందాలతో బతికినోళ్లు - Sakshi

వైకుంఠంపై వీరభద్రగౌడ్ వ్యాఖ్యలు
ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారని ఆరోపణ

 
ఆలూరు: ‘ నమ్మినోళ్లు, బంధువులనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర వారిది.. మేమిచ్చిన చందాలతో బతికారు.. అయినా ఎన్నికల్లో స్వపక్షం వారని కూడా చూడకుండా వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిం చారు. అలాంటి వారు మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నించడం విడ్డూరం’అని ఆలూరు టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరిని ఉద్దేశించి ప్రస్తుత ఇన్‌చార్జ్ వీరభద్రగౌడ్ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ మసాలపద్మజ  వైకుంఠం మల్లికార్జునచౌదరిని టీడీపీలో చేర్చేందుకు వీరభద్రగౌడ్‌ను కాదని మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబును కలిసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. వెన్నుపోటుదారులను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటే తమతోపాటు కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు తప్పవన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే గెలుపు కోసం ఎందుకు కృషి చేయలేకపోయారో చెప్పాలన్నారు.

గతంలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన మసాలపద్మజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఓటమికి ఆయన వెన్నుపోటు వ్యవహారమే కారణమన్నారు. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే మద్దతుదారులతో కలిసి తాము బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాం నాథ్‌యాదవ్, పార్టీ ఆలూరు మండల కన్వీనర్ నారాయణరెడ్డి, నాయకులు కృష్ణ, నరసప్ప,శేషగిరి, కురుబ జయరాం,తిమ్మయ్యతదితరులుపాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement