Sakshi News home page

సెల్యూట్‌ సార్‌..

Published Thu, Apr 16 2020 12:00 PM

Visakhapatnam Police ACP Kulasekhar Service Lockdon Duty - Sakshi

విశాఖ సిటీ: ప్రాణాంతకమైన వైరస్‌ ఓ వైపు. ప్రజలందరి కోసం పోలీసులు మరోవైపు. ‘మీరు ఇంట్లో ఉండండి. మీ కోసం మేము బయట ఉంటాం..’అని పదే పదే చెబుతూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇంట్లో ప్రశాంతంగా ఓ ముద్ద తినే పరిస్థితి వీరికి కరువైంది. కొంచెం తీరిక దొరికితే.. ఎక్కడో అక్కడ కడుపు నింపుకోవడం.. మళ్లీ విధుల్లో నిమగ్నమవ్వడం నిత్యకృత్యమైంది. కుటుంబం కన్నా... విధులు, సేవలకే ప్రాముఖ్యం ఇస్తూ.. మహమ్మారి నియంత్రణలో తమ వంతు పోరాటం చేస్తున్నారు. నగరంలోని రెడ్‌జోన్లలో విస్తృతంగా పర్యటిస్తూ.. తన వాహనంలోనే భోజనం చేస్తున్న ఏసీపీ కులశేఖర్‌ను ఈ చిత్రంలో చూడొచ్చు.

ఫ్లైఓవర్‌ పై తన వాహనంలోనే భోజనం చేస్తున్న ఏసీపీ

Advertisement
Advertisement