ఓటరు నమోదుపై అసంతృప్తి | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుపై అసంతృప్తి

Published Sun, Dec 8 2013 3:33 AM

voter Enrollment discontent bhanvarlal chief election officer

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆయన కలెక్టర్లతో శని వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఓటరు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరు శాతం ఫొటోతో కూడిన ఓటరు జాబితా తో పాటు, అర్హులైన వారందరికీ ఓటు ఇవ్వాలన్న లక్ష్యాన్ని నీరుగార్చవద్దని ఆయన సూచించారు. ఓటరు నమోదు గడువు ఈ నెల 17 వరకు పొడిగించి నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రదానంగా పోలింగ్ బూత్‌ల వద్ద బీఎల్‌ఓల నంబర్లు సక్రమంగా అందు బాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
 
 ఫోన్ నంబర్లు పని చేసినవి మాత్రమే అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. ఇం టింటి సర్వే చేసినప్పుడే డబుల్ ఎంట్రీ లు, మరణించిన వారి ఓటర్ల పేర్లను తొలగించాలని సూచిస్తున్నా సక్రమంగా జరగడం లేదన్నారు. బీఎల్‌ఓలు, ఎన్యుమరేషన్ అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని ఆదేశించారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలపై పూర్తి స్థారుులో అవగాహన కల్పిం చాలని సూచించారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఆయూ కేటగిరీల్లోని వయస్సు గల వారు నమోదు కావాలన్నారు. జిల్లా లో యువ ఓటర్లు నమోదు అంతంతమాత్రంగానే ఉండడంపై సీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. 
 
 జిల్లాకు అసోం, కొల్‌కత్తా నుంచి ఈవీఎంలు వస్తాయని చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఓటరు నమోదుపై విస్త­ృత ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. యువ ఓటర్ల నమోదు పెరిగేందు కు కళాశాలలతో పాటు అన్ని ప్రదాన కేంద్రాల్లో డ్రాప్‌బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు నియోజకవర్గానికో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించడం జరిగిందన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో ఇంటి నంబ ర్లు సక్రమంగా వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ, డీఆర్‌ఓ బి.హేమసుందర వెంకటరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఆర్‌డీఓ జె.వెంకటరావుతో పాటు ఎస్‌డీసీలు, తహశీల్దార్లు, ఎన్నికల డీటీలు పాల్గొన్నారు. 
 
 17వరకు ఓటరు నమోదు
 ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 17వరకు కొనసాగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ నెల 8, 15 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు ఫారాలతో సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఓటర్లు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement