Sakshi News home page

ఓటరు నమోదు వేగవంతం

Published Sun, Jan 5 2014 3:53 AM

Voter Registration ​​up Speed

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు నమోదు దరఖాస్తులను ఈనెల 10వ తేదీ లోగా పరిశీలించి, ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి  భన్వర్‌లాల్ ఆదేశించారు. ‘ఓటరు నమోదు కార్యక్రమం’పై  జిల్లా కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 17.79 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని..కేవలం 18 శాతం మాత్రమే పరిష్కరించామన్నారు. ఈవీఎంలలో పాడైన వాటి వివరాలు  తెలి యజేయాలని, ఈవీఎంల భవనాలను త్వరితగతితన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు  1.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు.  విచారణను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో నూర్‌భాషా ఖాసిం,  ఈఆర్‌వోలు పి. రజనీకాంతారా వు, జి. గణేష్‌కుమార్, వి.విశ్వేశ్వరరావు, ఎన్.తేజ్‌భరత్, టి.కైలాస్ గిరీశ్వర్, ఎం. వెంకటేశ్వరరావు, కె.సాల్మన్‌రాజ్, జె.సీతారామమూర్తి, హెచ్.వరప్రసాదరావు, ఆర్.గున్నయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
 10న జిల్లాలో ‘యువచైతన్యం’
 జిల్లాలో ఈనెల 10న ‘యువచైతన్యం’ నిర్వహిస్తున్నామని కలెక్టర్ సౌరభ్‌గౌర్ చెప్పారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించి  ఇచ్ఛాపురం నియోజకవర్గానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ, పలాసకు జిల్లా పరిషత్ సీఈవో, టెక్కలికి టెక్కలి ఆర్‌డీవో, పాతపట్నంకు ముఖ్యప్రణాళిక అధికారి, శ్రీకాకుళంకు మెప్మా పీడీ, ఆమదాలవలసకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, ఎచ్చెర్లకు శ్రీకాకుళం ఆర్‌డీవో, నరసన్నపేటకు డీఆర్‌డీఏ పీడీ, రాజాంకు పాలకొండ ఆర్‌డీవో, పాల కొండకు సీతంపేట ఐటీడీఏ పీవోలను  ప్రత్యేకాధికారులుగా నియమించామని చెప్పారు. వీరితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు.  యువజనులకు వివిధ కార్యక్రమాలపై  అవగాహన కల్పించడం, వారిని భాగస్వాములను చేయడం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం, మంచి పనితీరు కనబరిచిన వారిని సన్మానించడం వంటి పనులు చేపడతామన్నారు.  నెహ్రూ యువకేంద్రం  జిల్లా సమన్వయకర్త  కేవీ రమణ మాట్లాడుతూ ‘యువచైతన్యం’ కార్యక్రమంలో రక్తదాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. యువజన సంఘాలు తాము చేపట్టిన పనుల వివరాలు, ఛాయా చిత్రాలతో సహా యువ చైతన్యం కార్యక్రమంలో ప్రదర్శించుటకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులందరూ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement