వాటర్ యాపిల్ తెలుసా? | Sakshi
Sakshi News home page

వాటర్ యాపిల్ తెలుసా?

Published Sun, Apr 19 2015 6:22 AM

వాటర్ యాపిల్ తెలుసా? - Sakshi

వేటపాలెం: ఎర్రగా నిగనిగలాడే యాపిల్ పండు.. చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో రుచిలోనూ అలాగే ఉంటుంది. చలి ప్రదేశాల్లో పండే ఈ పండుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే వాటర్ యాపిల్ కూడా ఉంటుందని మీకు తెలుసా? ముంబైలో విరివిగా దొరికే ఈ యాపిల్ తూర్పు గోదావరి ప్రాంతాల్లో కూడా పండుతుంది.

 

ఈ చెట్టు బెరడు హెర్బల్ ఉత్పత్తుల తయారీకి వాడతుంటారు. ఇది పసుపు, ఎరుపు వర్ణాల్లో కాపునిస్తుంది. మామిడి పండు తరహాలో కేవలం వేసివిలో మాత్రమే చెట్టుకు కాయలొస్తాయి. చిన్నసైజు పువ్వ ఆకారంలో ఉండే వాటర్ యాపిల్ రుచిలోనూ తక్కువేం కాదు. ఇలాంటి అరుదైన చెట్టు వేటపాలెంలోని పిచ్చుక సునీల్ ఇంటి ఆవరణలో పెరుగుతోంది. ఈ చెట్టుకు పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాయడం విశేషం.

Advertisement
Advertisement