60 రోజుల్లోనే నోట్ల కష్టాలు అధిగమించాం: సీఎం | Sakshi
Sakshi News home page

60 రోజుల్లోనే నోట్ల కష్టాలు అధిగమించాం: సీఎం

Published Thu, Jan 12 2017 8:16 PM

we have overcome demonitization owes in 60 days, says chandra babu naidu

రెండు నెలల్లోనే పెద్దనోట్ల రద్దు కష్టాలను అధిగమించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిస్థితులపై మధ్యంతర నివేదికను త్వరలో ప్రధానిని కలిసి ఇవ్వబోతున్నామని ఆయన  చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక కూడా తర్వాత అందిస్తామని ఆయన అన్నారు. 
 
పెద్ద నోట్ల రద్దు వల్ల అన్ని రాష్ట్రాలూ ఇంకా ఇబ్బందులు పడుతున్నాయని, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ కష్టాలను 60 రోజుల్లోనే అధిగమించిందని తెలిపారు. దీన్ని ఒక సవాలుగా తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement