బొగ్గుబిడ్డలకు భరోసా ఇద్దాం | Sakshi
Sakshi News home page

బొగ్గుబిడ్డలకు భరోసా ఇద్దాం

Published Thu, Dec 26 2013 2:37 AM

we have provide support to minig workers

 రామకృష్ణాపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ :
 చెమటను రక్తంగా మార్చి భూగర్భంలోంచి బొగ్గు వెలికితీసి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుల శమ్ర వెలకట్టలేనిది.. వారికి వేతనం ఇస్తున్నాం కదా.. అని అనుండొచ్చు. కంపెనీలో కోల్‌ఫిల్ల ర్లు.. కోల్‌కట్టర్లు.. ట్రామర్లు.. టింబర్‌మన్లు.. బదిలీ ఫిల్లర్లు.. ఇలా వివిధ కేటగిరీలకు చెందిన కార్మికులు బొగ్గు ఉత్పత్తి కోసం శ్రమిస్తున్నారు. ప్రతీ కార్మికుడి వయసు 58 సంవత్సరాలు వచ్చే సరికి ఉద్యోగ విరమ ణ చేయాలన్న విషయం తెలిసిందే. ఉద్యోగంలో చేరిన నాటి వ్యక్తి విధుల నుంచి విరమించుకునే సమయం లో అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రకృతికి విరుద్ధమైన వాతావరణంలో శుశ్కించిన శరీరం.. రోగాలు రొప్పులే మిగులుతాయి. బతికున్నంత కాలం ఇంటిల్లిపాది సేవ చేయాల్సిందే. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం.. ఆర్థిక పరమైన మరో సమస్య కూడా ఉంది. ఉద్యోగ విరమణ చివరి దశలో చాలా మంది ఆరోగ్యం సహకరించక పూర్తి స్థాయిలో మస్టర్లు నిండడం లేదు. దీంతో అటు వేతనంతోపాటు పింఛను తగ్గి నష్టపోవాల్సి వస్తోంది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. రక్తాన్ని ధారబోసి న శ్రామికుడి బతుక్కి భరోసా లేని ఈ పరిస్థితుల్లో నల్ల సూర్యులుగా కీర్తించే బొగ్గు బిడ్డలకు ఏమీ చేయలేమా..? వ్యక్తిగతంగా అధికారులు ఏమీ చేయలేక పోవచ్చు.. యాజమాన్య పరంగా అవకాశం ఉంది. అందుకోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారు కావాలి.
 
 ఇదీ ప్రత్యామ్నాయం
 ఉద్యోగ విరమణకు దగ్గరున్న వారికి చివరి ఏడాది అండగా నిలవాలని ఎందరి నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ కంపెనీకి చేసిన సర్వీసును గుర్తించి చివరి ఏడాది యాక్టింగ్ విధులు అప్పగిస్తే బాగుంటుం దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వల్ల కార్మికుల్లో మానసిక ధైర్యాన్ని కల్పించి నట్లవుతుందని పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. రిటైరయ్యే కార్మికులకు చివరి పది నెలల సగటు వేతనాన్ని ఆధారంగా చేసుకుని పింఛన్ నిర్ణయమవుతుంది. అసలే వయసు మళ్లీ.. శరీరం సహకరించక తరచూ విధులకు గైర్హాజరయ్యే కార్మికులకు ఇది శాపంగా మారుతోంది. దీనిమూలంగా అటు వేతనం నష్టపోవడంతోపాటు పింఛన్ ఆశించిన విధంగా పొందలేకపోతున్నారు. జీవితాన్ని సంస్థకు ధారపోసినా ఆశించిన పింఛన్‌కు నోచుకోక పోతున్నామనే ఆందోళన వారిని బతికున్నం త కాలం వేధిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటగి రీకి నష్టం వాటిల్లకుండా ఉద్యోగ విరమణ చివరి సంవత్సరంలో కార్మికులకు శ్రమకు గుర్తింపుగా కనీ సం యాక్టింగ్ పనులు ఇచ్చి ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
 
 గుర్తింపు సంఘం చొరవ అవసరం
 ఉద్యోగ విరమణ పొందే.. పొందుతున్న కార్మికులకు అండగా నిలవాల్సిన గురుతర బాధ్యత గుర్తింపు కార్మిక సంఘంపైనే అధికంగా ఉందని కార్మికులు అంటున్నారు. ఇది కార్పొరేట్ స్థాయిలో చేయాల్సిన నిర్ణయం కావడంతో గుర్తింపు కార్మిక సంఘం తలచుకుంటే సాధ్యమేనని అంటున్నారు. కొందరు సింగరేణి అధికారులు సైతం ‘నిజమే ఈ ప్రతిపాదనతో కార్మికులకు ఎంతో మేలు జరుగుంది.. ప్రయోజనం కూడా ఉంటుంది.. అయితే ఈ పని రికగ్నైజ్డ్ యూనియన్ మాత్రమే చేయగలుగుతుంది’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే ఆరోగ్య సమస్య లు, ఇతర కారణాల రీత్యా కార్మికులకు యాక్టింగ్ విధులు ఇచ్చే అధికారం గని అధికారులకు లేదు. ఒక వేళ ఇచ్చినా నెల రోజులకు మించదు. యాజమాన్యం నిర్ణయిస్తేనే సాధ్యమవుతుంది. ఇందుకోసం కార్మికుల శ్రేయస్సు కోరే గుర్తింపు కార్మిక సంఘం నడుంబిగించి ప్రతిపాదనను కంపెనీ వద్దకు తీసుకెళ్లి ఒప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 జేబీసీసీఐలో చర్చించాలి
 ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కార్మికుల కు వేతనాలు నష్టపోకుండా లైట్‌జాబ్ ఇవ్వా లి. దశాబ్దాలుగా వారు చేసిన హార్డ్‌వర్క్‌ను గుర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మెడికల్ అన్‌ఫిట్ అయినవారికి కూడా సూటబుల్ జాబ్ ఇవ్వటం లేదు. సీనియర్ కార్మికులకు లైట్‌జాబ్ లేదా యాక్టింగ్ ఇచ్చే విషయమై జేబీసీసీఐలో చర్చించాలి. జాతీయ సంఘా లు కూడా ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
 - కెంగెర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
 
 అన్యాయం జరుగుతోంది
 రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న సీనియర్ కార్మికులకు బేసిక్ తగ్గకుండా సూటబుల్ జాబ్ ఇవ్వా లి. పని చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని అన్‌ఫిట్ చేయాలి. రెండు సంవత్సరాలు లేదు కదా అని కంపెనీ అన్‌ఫిట్ చేయట్లేదు. ఏళ్ల తరబడి సంస్థకు సేవలందించిన కార్మికులకు అన్యాయం జరుగుతోంది. వారి తరఫున హెచ్‌ఎంఎస్ పోరాటం సాగిస్తుంది.
 - రియాజ్‌అహ్మద్, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
 
 చేసిన సర్వీస్‌ను గుర్తించాలి
 ఉద్యోగ విరమణ పొందనున్న కార్మికులకు కొంతకాలం పాటు యాక్టింగ్ ఇస్తే మంచిది. గుర్తింపు కార్మిక సంఘం దీన్ని సాధించేం దు కు కృషి చేయాలి. రిటైర్ అవుతున్న వారు సంతోషంగా దిగిపోతే బాగుంటుంది. కార్మికు ల బాగోగుల కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది.
 - వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
 

Advertisement

తప్పక చదవండి

Advertisement