ప్రయాణీకులను రక్షణ కల్పిస్తాం: కౌముది | Sakshi
Sakshi News home page

ప్రయాణీకులను రక్షణ కల్పిస్తాం: కౌముది

Published Sat, Sep 7 2013 9:12 AM

ప్రయాణీకులను రక్షణ కల్పిస్తాం:  కౌముది

ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణీకులను రక్షణ కల్పిస్తామని అడిషనల్ డీజీ కౌముది శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. అలా వచ్చిన ప్రయాణికులకు హైదరాబాద్లో ఎవరైన ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ తెలిపారు. రైల్వే ఆస్తులకు ఎవరైన భంగపరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లోని అన్ని రైల్వే స్టేషన్లల్లో భద్రత బలగాను మోహరించినట్లు చెప్పారు.

 

అయితే నగరంలో నేడు ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించనున్నారు. ఆ సభలో  పాల్గొనేందుకు ఇప్పటికే సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలను నుంచి అసంఖ్యాకంగా ఏపీఎన్జీవోలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఆ స్టేడియం చుట్టూ పక్కల రోడ్లను మూసివేశారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ట్రాఫిక్ను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తామని పోలీసులు తెలిపారు.

 

హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లును ఏర్పాటు చేశారు. అలాగే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 40 చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి వచ్చే వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కర్నూలు నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్స్, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మహబుబా కాలేజీలో పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే అబ్ధుల్లాపూర్మెట్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement