Sakshi News home page

'నెల్లూరు జడ్పీ పీఠం మాదే'

Published Sun, Jul 20 2014 11:47 AM

మేకపాటి రాజమోహన రెడ్డి - Sakshi

జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు ప్రతిసారి అడ్డంకులు సృష్టించాలని అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని నెల్లూరు లోక్సభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ జడ్పీటీసీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్నిక ప్రయత్నాలు చేసిన నెల్లూరు జడ్పీ ఛైర్మన్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని తెలిపారు. తమ పార్టీ జడ్పీటీసీ సభ్యులను ఎత్తుకెళ్లడానికే పోలీసులు కాపలాకాస్తున్నట్లుందని జడ్పీ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అనుసరిస్తున్న వ్యవహారశైలిని మేకపాటి ఎద్దేవా చేశారు.   


ఆదివారం జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనున్న నేపథ్యంలో జడ్పీ సమావేశ మందిరానికి మేకపాటితోపాటు ఆ పార్టీ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి బి.రాఘవేంద్రరెడ్డి వచ్చారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... అర్థంపర్థం లేని సాంకేతిక సమస్యలను చూపి జడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ యత్నిస్తోందని ఆరోపించారు. నేడు జరుగుతున్న జడ్పీ పీఠం ఏన్నిక ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వాయిదా పడే ప్రసక్తే లేదని రాఘవేంద్ర రెడ్డి స్సష్టం చేశారు. నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement