ఎదురుచూపులు | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులు

Published Fri, Jan 30 2015 2:51 AM

When the second installment of the loan waiver?

రెండో విడత రుణమాఫీ ఎప్పుడో తెలియక అవస్థలు
 పలుమార్లు వారుుదాపడి 31తో ముగియనున్న గడువు
 1.40 లక్షలకు పైగా ఖాతాలు అప్‌లోడ్ చేయనున్న అధికారులు
 ఇందులో తిరస్కరణ అయితే పరిస్థితి ఏమిటని రైతుల ఆందోళన

 
కడప : అధికారంలోకి రావడమే తరువాయి... తొలి సంతకంతోనే రుణమాఫీ అంటూ ‘దేశం’ నేతలు ఊదరగొట్టినా తీరా అమలుమాత్రం అంతంతే. మొదటి విడతలో రూ. 50 వేలలోపు ఉన్న రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నా అది ఉత్తుత్తిదే అని తేలిపోరుుంది. ఇక లక్ష రూపాయలు, ఆపైన రుణం తీసుకున్న వారికి తొలి విడతలో రూ. 20 వేలు వేస్తున్నట్లు పేర్కొన్నా అది కూడా అందరికి దక్కలేదని పలువురు రైతులు వాపోతున్నారు. మరికొంతమంది రైతులకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది. ఆధార్‌కార్డు సరిగా లేదనో... రేషన్‌కార్డులో తప్పులు ఉన్నాయనో... కుటుంబ వివరాలు లేవనో... ఏదో ఒకసాకు చూపి తిరస్కరించడంతో  నిస్సహాయ స్థితిలో రైతన్నలు కొట్టుమిట్లాడుతున్నారు. రెండవ విడతకు సంబంధించి ప్రభుత్వం గడువుమీద గడువు పెంచుతూ పోతూ ఎట్టకేలకు 31తో ముగిస్తోంది.

 తొలి విడతలో 2,78,078 మందికి వర్తింపు

 తెలుగుదేశం సర్కార్ రుణమాఫీ పేరుతో ఎంతో కొంత రైతుల ఖాతాల్లో జమచేసి మాఫీని మమ అనిపించారు. మొదటి విడతకు సంబంధించి 2,78,078 మందిలో చాలామందికి అంతంత మాత్రంగానే జమ అరుుంది. పూర్తి స్థాయి మాఫీ కొందరికి మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 4,95,008 రైతులకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వానికి రుణమాఫీ అర్హుల జాబితాగా అప్‌లోడ్ చేసినా అందులో 2,78,070 మందికే వర్తించడం వెనుక మతలబు అర్థం కావడంలేదు. పైగా ఏదో ఒక సాకుచూపి ఎంత వీలైతే అంత మాఫీని తగ్గించడమే పరమావధిగా ప్రభుత్వం ముందకు వెళుతోందని విమర్శలు వ్యక్తం అవుతున్నారుు. 2,78,070 మంది రైతులకు సంబంధించి సుమారు రూ. 315.82 కోట్లు  మంజూరు చేసింది. ఇప్పటికి కొన్ని బ్యాంకులు ఇచ్చినా చాలా మండలాల్లో రైతుల ఖాతాల్లో జమ చేయలేదు.

ఇచ్చిన సొమ్మంతా వడ్డీకే

 రుణమాఫీ కింద ప్రభుత్వం అందజేస్తున్న సొమ్మంతా వడ్డీకే సరిపోతోంది. ఉదాహరణకు లక్ష రూపాయలు లోను ఉన్న రైతుకు ప్రస్తుతం రెన్యూవల్ చేయడానికి దాదాపు రూ.17 వేలు వడ్డీ అవుతుంది. ప్రభుత్వం మాత్రం రూ. 20 వేలు ఖాతాలో రుణమాఫీ కింద జమచేస్తే మిగిలేది రూ.3 వేలు మాత్రమే. ఇలా ప్రతి రైతుకు రుణమాఫీలో వచ్చిన మొత్తం రెన్యూవల్ చేస్తే వడ్డీకే సరిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. పైగా రుణమాఫీ వర్తించిన రైతులను బ్యాంకు అధికారులు పదేపదే పిలుస్తూ రెన్యూవల్ చేసుకోవాలని కోరుతున్నారు. రెన్యూవల్ చేయడం ద్వారా మాఫీసొమ్మును వడ్డీకి జమ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో బ్యాంకు లావాదేవీలు చాలావరకు పడిపోయిన నేపధ్యంలో రెన్యూవల్ ద్వారా మళ్లీ బ్యాంకుల్లో సేవలు ఊపందుకునేలా జాగ్రత్త పడుతున్నారు.
 
రెండవ విడత ముగింపునకు సిద్ధమవుతున్న అధికారులు

 మొదటి విడత పూర్తయింది... రెండవ విడత జనవరి 8వ తేదీలోపు ప్రభుత్వానికి రైతుల జాబితా వస్తుందని పేర్కొన్నా... రానురాను గడువు పెరిగిపోతోంది. తొలుత 8వతేదీ అనుకున్నా తర్వాత 14, 23, ప్రస్తుతం ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రెండవ విడతలో ఇప్పటికే సుమారు 1,09,682 రైతుల ఖాతాలను అప్‌లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మొదటి విడతలో ఆధార్, రేషన్‌కార్డుల్లో తేడా నేపధ్యంలో తిరస్కరణకు గురైన ఖాతాలను కూడా మండల లెవెల్ కమిటీ పరిశీలించి సుమారు 33 వేలు రైతుల ఖాతాలను అప్‌లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ కూడా రెండవ విడత లిస్టులో ప్రభుత్వానికి వెళ్లనున్నారుు. అక్కడ ఎన్నిటికి కోత పడుతుందో ఎంతమంది అర్హులవుతారోనని ఎదురుచూస్తున్నారు.
 
 
 

Advertisement
Advertisement