ఎవరు చంపారు? | Sakshi
Sakshi News home page

ఎవరు చంపారు?

Published Sat, Dec 21 2013 3:18 AM

Who was killed?

డీ.హీరేహాళ్/రాయదుర్గం, న్యూస్‌లైన్: సోమలాపురానికి చెందిన ఇందుప్రియ (20)ను ఇంత కిరాతకంగా ఎవరు హత్య చేశారో పోలీసులు దర్యాప్తు చేసి  వెంటనే తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  ఈ సంఘటనపై రాజకీయ నాయకులు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోం ది. శుక్రవారం ఉదయం ఆమె మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులతోపాటు పలువురు నాయకులు ఆస్పత్రికి వెళ్లి ఆమె మృతదే హం వద్ద నివాళులర్పించారు.
 
 దర్యాప్తు ముమ్మరం: ఇందుప్రియ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె తండ్రికి ఎవరితోనూ కక్షలు లేకపోవడంతో, అమె డీఎడ్ చదివిన కళాశాల కోణం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. కళాశాలలో ఆమె ఎవరెవరితో సన్నిహితంగా ఉండేది, అక్కడ ఎవరితోనైనా ఆమెకు గొడవలున్నాయా అన్న అంశాలపై ఆ కళాశాల విద్యార్థులను విచారణ చేస్తున్నారు. ఆమెపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు.
 
 కాగా, నిందితుల ఆచూకీ కోసం రప్పించిన పోలీసు జాగిలం విఫలమైంది.  గురువారం రాత్రి 10 గంట లకు సంఘటన స్థలానికి చేరుకున్న జాగిలం గ్రామంలోని హాస్టల్ మీదుగా ఎస్సీకాలనీ లోని ఆర్డీటీ పాఠశాల వద్దకు వెళ్లి పది నిమిషాలు అక్కడే తిరుగాడింది. అనంతరం సమీపంలోని వాటర్ ట్యాంకు పక్క నుంచి మరో ఇంటి వద్ద ఆగి, అక్కడి నుంచి చర్చి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి  ఆమె చిన్నాన్న హనుమంతరెడ్డి వాహనం వద్ద కాసేపు ఆగి ముందుకెళ్లింది.
 
 శుక్రవారం ఉదయం మళ్లీ ప్రయత్నించినా ఆచూకీ గుర్తించలేకపోయింది కొవ్వొత్తుల ర్యాలీ : ఈ దుర్ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి సతీమణి భారతి ఆధ్వర్యంలో పలువురు మహిళలు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకోగానే, విగ్రహం చుట్టూ కొవ్వొత్తులు వెలి గించి తెలుగు ప్రజలకు వెలుగునిచ్చిన నీవు, కిరాతకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు.
 

Advertisement
Advertisement