ఏపీని అగ్రస్థానంలో నిలబెడతా! | Sakshi
Sakshi News home page

ఏపీని అగ్రస్థానంలో నిలబెడతా!

Published Sun, Apr 26 2015 2:14 AM

ఏపీని అగ్రస్థానంలో నిలబెడతా! - Sakshi

సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
 సునామీ, సముద్ర పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన  

 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు: దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీని అగ్రస్థానంలో నిలబెడతానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అదేవిధంగా నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెంలో సుమారు రూ.600 కోట్లతో ఏర్పాటు చేయనున్న సునామీ, సముద్ర పరిశోధన కేంద్రాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, హర్షవర్థన్, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు హాజరైన ఈ కార్యక్రమం అనంతరం కోట మండలం విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. నెల్లూరు ప్రాంతంలోని సముద్రతీరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధిని కల్పిస్తామన్నారు.  రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏమీ చెప్పకుండానే రాష్ట్రాన్ని విభజించిందని, అయితే ఏపీ కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడి కొన్ని అంశాలపై వాదించారని కొనియాడారు.
 
 మల్లి బాబు అమరజీవి : నెల్లూరు జిల్లాకు చెందిన మల్లి మస్తాన్‌బాబు అమరజీవి అని కొనియాడారు.
 జలదీక్ష చేస్తున్నా :అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష చేసిన విధంగా కరువు తనను చూసి భయపడేలా తాను జలదీక్ష చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.  ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన ప్రతిపక్షాలు చెల్లని కాసులని విమర్శిస్తూ ప్రసంగించారు.

Advertisement
Advertisement