భార్యపై యాసిడ్ పోసిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యపై యాసిడ్ పోసిన భర్త

Published Sat, Jun 21 2014 1:44 PM

Woman acid attacked by her husband in east godavari district

గోకవరం : తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తే... భార్యపై యాసిడ్ పోసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ బాధితురాలిని పరామర్శించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

 

Advertisement
Advertisement