పెళ్లి చేసుకుంటానని టెకీని దోచేసిన వివాహిత | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని టెకీని దోచేసిన వివాహిత

Published Wed, Aug 20 2014 11:09 PM

పెళ్లి చేసుకుంటానని టెకీని దోచేసిన వివాహిత

హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ టెకీని మోసం చేసి 4 లక్షల రూపాయిలు టోకరా వేసిన ఓ వివాహితను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నిందితురాలు వివాహప్రకటనల సైట్లో తన పేరును రాజ్యలక్ష్మిగా పేర్కొంటూ తప్పుడు ప్రొఫైల్ పోస్ట్ చేసింది. వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని, చెన్నైలోని ఓ పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానని, తగిన వరుడు సంప్రదించవచ్చని ప్రకటన ఇచ్చింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే అశోక్ రెడ్డి ఆమెను సంప్రదించాడు. ఫోన్, మెయిల్స్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. నిందితురాలు ఇద్దరు వ్యక్తులను తన తల్లిదండ్రులుగా నమ్మించి, పెళ్లికి అంగీకరిస్తున్నట్టుగా వారితో అశోక్ రెడ్డికి చెప్పించింది. ఆ తర్వాత తన ఉద్యోగవసరార్థం నాలుగు లక్షల రూపాయిలు కావాలని అశోక్ రెడ్డిని అడిగింది. అతను రెండు విడతలుగా 4.2 లక్షలు బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. నిందితురాలి ప్రవర్తన తేడాగా ఉండటంతో తాను మోసపోయానని అశోక్ రెడ్డి గ్రహించాడు. ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు జిల్లా కావలికి చెందిన నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరపరిచారు. ఆమె ఇంతకుముందు కూడా పెళ్లి పేరుతో మరో ఇద్దరిని మోసగించినట్టు వెలుగుచూసింది. నిందితురాలు భర్త అండతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
Advertisement