అప్పు చెల్లించలేదని మహిళను నిర్బంధించిన వ్యాపారి | Sakshi
Sakshi News home page

అప్పు చెల్లించలేదని మహిళను నిర్బంధించిన వ్యాపారి

Published Sun, Dec 1 2013 9:06 AM

Woman house arrest in tirumala

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని కస్తురి అనే మహిళను రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ దాదాపు ఐదు నెలలపాటు గృహ నిర్బంధించాడు. దాంతో స్థానికులు, మీడియా సహాయంతో ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను గృహ నిర్బంధం నుంచి రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.

 

పోలీసుల కథనం ప్రకారం... గతంలో కస్తురి అనే మహిళ రియల్ వ్యాపారి ప్రసాద్ వద్ద రూ. 4 లక్షల అప్పు చేసింది. ఆ అప్పు చెల్లించడంలేందంటూ గత ఐదు నెలల క్రితం ప్రసాద్ ఆమెను తన గృహంలో నిర్బంధించాడు. తనను విడుదల చేయాలని కస్తురి ఎన్నిసార్లు ప్రాదేయపడిన ప్రసాద్ కనికరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ విషయం స్థానికులకు తెలియడంతో మీడియాకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్ట్ చేశారు. కస్తురి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement