భవనంపైకి ఎక్కి... కిరోసిన్ పోసుకుని | Sakshi
Sakshi News home page

భవనంపైకి ఎక్కి... కిరోసిన్ పోసుకుని

Published Wed, Dec 4 2013 12:41 AM

woman suicide attempt on dubbaka

దుబ్బాక, న్యూస్‌లైన్: అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి భవనంపైకి ఎక్కిన ఓ మహిళ.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దుబ్బాక పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం...దుబ్బాకకు చెందిన బోడి కృపాకర్‌కు ఐదేళ్ళ క్రి తం రాజమండ్రికి చెందిన పరిమళ(27) తో వివాహం జరిగింది. పాస్టర్‌గా పనిచేసే కృపాకర్ వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో కలిసి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు లేఖన, బేరునిక సంతానం. కృపాకర్ ఇటీవల దుబ్బాకలో ఉంటున్న తన పాత ఇంటిని కూల్చేసి కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. దీం తో కృపాకర్ కొద్దిరోజుల క్రితం కుటుం బంతో సహా దుబ్బాకకు వచ్చి ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలే కూతుళ్లను కూ డా దుబ్బాకలోని ఓ ప్రైవేటు పాఠశాల లో చేర్చించాడు.
 
 కాగా, మంగళవారం కృపాకర్ తన భార్య పిల్లలతో కలిసి దు బ్బాకలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉం టున్న తన మరోసోదరి చిట్టి ఇంటికి వచ్చారు. సాయంత్రం సమయంలో కృపాకర్ తాను నిర్మించుకుంటున్న భవ న నిర్మాణ పనుల వద్దకు వెళ్లాడు. ఆ కొద్దిసేపటికే కృపాకర్ భార్య పరిమళ ఇంట్లో ఉన్న అల్లుడు పండు(కృపాకర్ సోదరి కుమారుడు)కు ఓ లేఖ ఇచ్చి దాన్ని మామయ్యకు ఇచ్చి రమ్మని ఆ చిన్నారిని పంపింది. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని భవనం పైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకుంది. మంటల కు తాళలేక బిగ్గరగా కేకలు వేసింది. భవనంపై పెద్దఎత్తున మంటలు చెలరేగ డం పరిమళ గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు, పరిమళ భర్త కృపాకర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దుబ్బాక సీఐ రామకృష్ణరెడ్డి  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
 పశ్చాతాపంలోనే ఆత్మహత్య
 మృతురాలు పరిమళ ఆత్మహత్యకు చేసుకునే ముందు తన భర్త కృపాకర్‌కు రాసిన రెండు పేజీల లేఖలో తీవ్ర పశ్చాతాపం తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె లేఖ రాయటానికి గల కారణాలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులపై వారు దర్యాప్తు చేస్తున్నారు. వీరు అదిలాబాద్ జిల్లా నుంచి ఇటీవలే దుబ్బాకకు రావటంపై కూడా పలు అనుమనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  
 
 బారులు తీరిన జనం...
 దుబ్బాకలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ భవనంపై పరిమళ ఆత్మహత్య చేసుకోవటం చూసిన స్థానికులంతా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. భవనంపైన పెద్ద ఎత్తున మంటలు రావటంతో చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకుని భవనంపైకి ఎక్కి ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో వారంతా తీవ్ర కలత చెందారు. తల్లిని కోల్పోయిన పరిమళ ఇద్దరు కూతుళ్లను చూసి వారంతా కంటతడిపెట్టారు.

Advertisement
Advertisement