మరుభూమే అమ్మ ఒడి  | Sakshi
Sakshi News home page

మరుభూమే అమ్మ ఒడి 

Published Thu, Jul 9 2020 12:01 PM

Woman Who Grows Up An Orphan Boy YSR Kadapa District - Sakshi

సాక్షి కడప: ఆమె నివసించేది శ్మశానం.. వృత్తి కాటికాపరి.. కటిక పేదరికం వెంటాడుతున్నా మనసు మాత్రం గొప్పది. తను తినడానకి తిండి లేక అల్లాడుతున్నా ఎవరో బస్టాండ్‌లో వదిలేసిన బిడ్డను పాతికేళ్గగా సాకుతున్న అమ్మ మనసు ఆమెది. కూర్చోలేడు, నడవలేడు, కదల్లేడు. ఆ బిడ్డకు అన్నీ తానై పెంచుతోంది కడపలోని ఆర్టీసి బస్టాండు సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో నివాసం ఉంటున్న చిలంకూరు జయమ్మ దాతృత్వానికి తార్కాణమిది. పుట్టుకతోనే వికలాంగుడిగా జన్మించాడు మస్తాన్‌. రెండు చేతులు వంకర పోయాయి. కాళ్ళు కూడా చచ్చుబడి కదల్లేని పరిస్థితి. 25 ఏళ్ల క్రితం కదల్లేని మెదల్లేని ఈ బిడ్డను జయమ్మ బస్టాండ్‌లో గమనించింది. మనసు కరిగిపోయింది. ఆ బిడ్డకు మానసికంగా అంత ఎదుగుదల లేదు. మస్తాన్‌ అని పేరు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 

మస్తాన్‌కు అన్నీతానై..
శ్మశాన వాటికలోనే పాడుబడిన సత్రంలో జయమ్మ చాలాకాలంగా ఉంటోంది రు. శ్మశానానికి వచ్చే శవాలను పూడ్చడం మెదులు మిగతా పనులను చేయగా వచ్చిన సొమ్ముతో.. మస్తాన్‌తో పాటు జీవనం సాగిస్తోంది. మస్తాన్‌కు అన్నం తినిపించడంతో పాటు అన్ని పనులూ ఆమె చేయాల్సి ఉంటుంది. సైకిల్‌ ద్వారా నెమ్మదిగా మంచం వరకు తీసుకొచ్చి పడుకోబెడుతోంది. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని కన్నీరు పెట్టుకుంది జయమ్మ. 55 ఏళ్ళుగా ఉంటున్నా జయమ్మకు ఏ కార్డు దక్కలేదు. శ్మశానంలో డోరు నంబరు లేదన్న కారణంతో పథకాలకు దూరమయ్యారు.. చివరకు రేషన్‌ కార్డు కూడా లేదు. ఆదార్‌ కార్డు ఉన్నా శ్మశా నంలో ఉన్న వారికి  లబ్ది చేకూరలేదు. అష్ట కష్టాలు పడుతున్న ఆమెకు రేషన్‌ కార్డుతో పాటు పింఛన్‌. ఇంటిపట్టా లాంటివి అందించాలని వేడుకుంటోంది.మస్తాన్‌ పరిస్దితి బాగు లేని విషయం తెలిసినా ఏఒక్కరూ కూడా స్పందించడం లేద ని ఆవేదన వ్యక్తం చేస్తొంది. దివ్యాంగుల కోటాలో  మానవ తా హృదయంతో మస్తానుకు  పించన్‌ మంజూరు చేసినా కొంత మేలు జరుగుతుందని జిల్లా కలెక్టరును వేడుకుంటోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement