మహిళా మావోయిస్టు అరెస్టు | Sakshi
Sakshi News home page

మహిళా మావోయిస్టు అరెస్టు

Published Wed, Apr 6 2016 6:39 PM

మహిళా మావోయిస్టు అరెస్టు - Sakshi

గుంటూరు: ఒక మహిళా మావోయిస్టును గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ అలియాస్ పద్మ అలియాస్ సుగుణను బుధవారం మధ్యాహ్నం 2గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఈమె పలు కేసులు ఉన్నాయి. బండ్లమోటు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. 2001లో మందుపాతర పేల్చి ఓ ఎస్సై, ఏడుగురు కానిస్టేబుళ్లు, మరో వ్యక్తి చనిపోవడానికి ఆమె కారణమైందని ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఇన్ఫార్మర్లు అనే పేరిట కొంతమందిని కాల్చి చంపేసినట్లు కూడా కేసు ఉంది. ఆమెను ఆరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ అనారోగ్యంగా కారణంతోనే సోదరి ఇంటికి వచ్చానని చెప్పింది. ఎప్పటికైనా విప్లవంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని మీడియాకు తెలిపింది.

Advertisement
Advertisement