మద్యపానం నిషేధించాలని మహిళల దీక్ష | Sakshi
Sakshi News home page

మద్యపానం నిషేధించాలని మహిళల దీక్ష

Published Thu, Oct 3 2013 4:44 AM

Women's initiation of alcohol ban

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: మద్యపానాన్ని నిషేధించాలన్న డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదుట మహిళలు బుధవారం ఒక రోజు దీక్ష చేశారు. తెలంగాణ బీసీ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వడ్డెబోయిన వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్ష శిబిరాన్ని ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్ హెచ్‌ఎం మంజుల ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మద్యపానంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మద్య నిషేధం విధించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల  వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జరి  పండరినాధ్, సోమా అశోక్, మల్లేష్, చింతల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఈ శిబిరాన్ని వైఎస్‌ఆర్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మార్కం లింగయ్య, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ కాంపల్లి బాలక్రిష్ణ, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెల వెంకటేశ్వర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్.వెంకటేశ్వర్లు, వల్లూరి సత్యనారాయణ, దొడ్డి సాంబయ్య, నగర మహిళా కన్వీనర్  కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జిల్లా నాయకులు కీసర పద్మజారెడ్డి, రమాదేవి, వేముల సీత, జాకప్ ప్రతాప్; టీఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నాయకులు నందగిరి శ్రీను, రమణయాదవ్, లక్ష్మి నారాయణ, సాగర్; టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు; ఉద్యోగ సంఘాల నాయకులు కత్తి నెహ్రూ, షౌకత్ అలి; సీపీఐ నాయకులు మేకల సంగయ్య, మల్లేశం; గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు పిట్టల నాగేశ్వరావు, అక్తర్, మేకల సుగుణారావు, వెంకటస్వామి; ఎంఆర్‌పీస్ జిల్లా ఇంచార్జి కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ; ఎంఎస్‌ఎఫ్ నాయకులు ఎన్.విజయరాజు మాదిగ, వెంకట్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
 

Advertisement
Advertisement