బాబోయ్ చలి | Sakshi
Sakshi News home page

బాబోయ్ చలి

Published Mon, Jan 12 2015 6:59 AM

WonderGeneration cold

  • జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • కనిష్టం 13.7, గరిష్టం 30.5 డిగ్రీలు
  • వీడని మంచు తెరలు
  • చలికి వణుకుతున్న ప్రజలు
  • తిరుపతి తుడా: రెండు రోజులుగా చలి వణికిస్తోంది. సాయంత్రం నుంచి తెల్లవారి ఎని మిది గంటల వరకు మంచు తెరలు పరుచుకుంటున్నాయి. దీంతో ప్రజలు రాత్రి చలితో వణికి, పగటి పూట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయసంధ్య వేళ చలిగాలులు వణికిస్తున్నాయి. మంచు తెరలు గ్రామాలను కప్పేస్తున్నాయి. రహదారుల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని పడమటి మండలాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటోంది.

    వాతావరణంలో భారీ మార్పులు రావడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, వ్యాధులతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. శనివారం జిల్లాలో 14.9 గా ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం మరింత తగ్గి 13.7కు పడిపోయింది. పగలు గరిష్టంగా 30.5గా నమోదైంది. మునుపెన్నడూ ఒక రోజు ఇంత భారీ తేడాతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement