పెద్దలకు పరమాన్నం..పిల్లలకు పురుగుల అన్నం | Sakshi
Sakshi News home page

ఇదేం వడ్డింపు?

Published Wed, Nov 1 2017 11:27 AM

Worms rice midday meal in government school - Sakshi

సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో అధికారుల తీరుకు అద్దం పట్టే చిత్రాలివి! పిల్లల సంక్షేమాన్ని గాలికి వదిలేశారనేందుకు నిదర్శనాలివి! ఈ ఫోటోలో ఒకపక్క కనిపిస్తున్నది పెద్దలకు పరమాన్నం.. మరోపక్క ఉన్నది పురుగులతో కూడిన అన్నం. నిత్యం పెదపాడులోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల్లో జరుగుతున్న తంతు ఇది. ఇక్కడ ప్రతిరోజూ రెండు సార్లు వంట చేస్తారు. అందులో ఉపాధ్యాయులకు బాస్మతి రైస్‌తోనూ పిల్లలకు మాత్రం నిత్యావవసర సరుకుల బియ్యంతోనే వంట చేసి చేతులు దులుపుకుంటున్నారు. రెండు రోజులుగా స్థానిక పెదపాడు గురుకుల పాఠశాల స్కూల్లో జరుగుతున్న తరంగ్‌ కార్యక్రమాల్లో ఇవి ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. తరంగ్‌ కార్యక్రమంలో హాజరైన అతిథులకే మాత్రమే ఈ వంటకాలు వండినట్లు అక్కడ సిబ్బంది చెప్పుకోవడం గమనార్హం!  

Advertisement

తప్పక చదవండి

Advertisement