నీచ రాజకీయాలకు టీడీపీ నాంది | Sakshi
Sakshi News home page

నీచ రాజకీయాలకు టీడీపీ నాంది

Published Fri, Feb 26 2016 1:36 AM

నీచ రాజకీయాలకు టీడీపీ నాంది - Sakshi

మేడికొండూరు : రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నీచ రాజకీయాలకు నాంది పలుకుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడికొండ నియోజకవర్గ విస్త్రృతస్థాయి సమావేశం గురువారం పేరేచర్లలో నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర సురేష్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ   సీఎం చంద్రబాబు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.  సంతలో పశువులని కొనుగోలు చేసిన మాదిరిగా ఎమ్మెల్యేను కొంటున్నారని మండిపడ్డారు. సిగ్గూఎగ్గూ లేకుండా అధికార, ధన దాహంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు.

ఎమ్మెల్యేలతోరాజీనామా చేయించాలి: అంబటి
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మాత్రం కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన టీడీపీ నేతలకు సైతం తాము అండగా ఉంటామని, ల్యాండ్ పూలింగ్ సమయంలో ఒకలా నటించిన చంద్రబాబు, ఇప్పుడు మాటమార్చారని మండిపడ్డారు. సిగ్గుమాలిన ఎమ్మెలేలు వస్తే, సిగ్గుమాలిన చంద్రబాబు, లోకేష్‌లు వారి చేత రాజీనామా చేయించి, గెలిచిన తరువాత పార్టీలోకి తీసుకోవాలని సవాల్ విసిరారు.
 
 ఎటువంటి నష్టం లేదు
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు నలుగురు వెళ్ళినంతమాత్రాన తమకు ఎటువంటి నష్టం లేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరిచింన ఎమ్మెల్యేలు చరిత్ర హీనులుగా మిగిలిపోవటం తథ్యమన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ ఎట్టి పరిస్ధితుల్లోనూ వైఎస్సార్ సీపీని వీడబోయేదిలేదన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం తప్ప చేసిన అభివృద్ధి ఏముందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త  బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లను సైతం ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త  హెన్నీక్రిస్టినా మాట్లాడుతూ అబద్దం అనే మాట పుట్టిన తరువాతే చంద్రబాబు పుట్టారని ఎద్దేవా చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement