‘చెత్త’ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

‘చెత్త’ మార్కెట్లు

Published Wed, Jan 8 2014 3:42 AM

worst markets

 జిల్లాలోని మార్కెట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. రోజుల తరబడి వ్యర్థాలను తొలగించడం లేదు. దుర్వాసన కారణంగా మార్కెట్లలోకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేరు. జిల్లాలోని 50 శాతానికిపైగా మండలాల్లో మార్కెట్ల ఊసే లేదు. సంతలు లేదా రోడ్లపైనే అమ్మకాలు సాగుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.
 
 సాక్షి, చిత్తూరు:
 జిల్లా వ్యాప్తంగా కూరగాయల మార్కెట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే వారు కరువవుతున్నారు. తిరుపతి, పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు వంటి పెద్ద పట్టణాల మార్కెట్లలో చెత్త రెండు రోజులకోసారి తొలగిస్తున్నారు. రెండవ శ్రేణి పట్టణాలైన పలమనేరు, శ్రీకాళహస్తి వంటి చోట్ల మూడునుంచి నాలుగురోజులకోసారి చెత్త తొలగిస్తున్నారు. వి.కోటవంటి చోట్ల చెత్త ను తొలగించేవారే లేరు. సత్యవేడు వంటి పట్టణాల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు సా గుతున్నా యి. జిల్లాలో ని 50 శాతానికిపైగా మండలాల్లో మార్కెట్లే లేవు. తిరుప తి, చిత్తూరు నగరాల్లోని రైతు బజార్ల నిర్వహణ అంతంతమాత్రంగా ఉంది.
 
     కుప్పం బైపాస్‌రోడ్డులో కూరగాయల మార్కెట్ ఉంది. రోజుకు 500 మందికిపైగా కొనుగోలుదారులు వస్తుంటారు. మార్కెట్‌లోనే వ్యర్థాలను పడేస్తున్నారు. చెత్త తొలగింపు చర్యలను పంచాయతీ  పట్టించుకోవడం లేదు. దుర్వాసన కారణంగా ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు.
 
     వి.కోట, పలమనేరు  మార్కెట్ల నిర్వహణ సరిగా లేదు. వ్యర్థాలను సకాలంలో తొల గించడం లేదు. పలమనేరులో కూరగాయల వ్యర్థాలను తొలగించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు మున్సిపాలిటీకి నెలవారి డబ్బులు చెల్లించడం లేదు. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. బెరైడ్డిపల్లె, పెద్దపంజాణి, గంగ వరం మండలాల్లో కూరగాయల మార్కెట్లే లేవు.
 
     సత్యవేడులో మార్కెట్ ఉన్నా నిరుపయోగం. మార్కెట్ గదుల్లో సరైన సౌకర్యాలు లేవు. దీంతో వ్యాపారులు రోడ్డుపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు ప్రయివేటుగా గదులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. కూరగాయల వ్యర్థాలను రోడ్లపైనే కుమ్మరిస్తున్నారు. సమస్యను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లే దు. వ్యర్థాలను తినేందుకు పశువులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నాగలాపురం, బీఎన్.కండ్రిగలో కూరగాయల మార్కెట్లు లేవు. పిచ్చాటూరులో కొత్తగా సంత పెట్టారు.
 
    శ్రీకాళహస్తి పెద్ద మార్కెట్లో నాలుగురోజులకోసారీ కూడా మున్సిపాలిటీ వారు చెత్త తీయడం లేదు. ఏడు మిని మార్కెట్లలోనూ చెత్త పేరుకుపోయి ఉంటోంది.
 
     పుత్తూరులోని మార్కెట్‌లో 40 గదులు ఉన్నాయి. సౌకర్యాలు అంతంతమాత్రమే. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. రెండు రోజులకోసారి చెత్త తొలగిస్తున్నారు. నగరిలో సంత ఉంది. నిండ్ర, వడమాల పేట, విజయపురంలో కూరగాయల మా ర్కెట్లు లేవు.
 
     చంద్రగిరి నియోజకవర్గానికి అంతటికీ కలిపి చంద్రగిరిలోనే కూరగాయల మార్కెట్ ఉం ది. ఇక్కడా పారిశుద్ధ్యం అంతంతమాత్రమే. ఎర్రవారిపాళెం, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్‌లో కూరగాయల మార్కెట్లు లేవు.
 
     బి.కొత్తకోటలో మార్కెట్‌లేదు. రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు సాగుతున్నాయి. తంబళ్లపల్లె, ములకలచెరువు, పీటీఎం, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో కూరగాయల మార్కెట్లు లేవు.
 
     జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కూరగాయల మార్కెట్లు లేవు. పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం మండలాల్లో వారానికోసారి సంత నిర్వహిస్తున్నారు. అయితే షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.
 
     చిత్తూరు, పుంగనూరులో కూరగాయల మార్కెట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. చెత్త తొలగింపులో జాప్యం చోటు చేసుకుం టోంది. ఈ క్రమంలో కొనుగోలుదారుల అ వస్థలు వర్ణనాతీతం.

Advertisement

తప్పక చదవండి

Advertisement