కుంటిసాకులు చెప్పొద్దు | Sakshi
Sakshi News home page

కుంటిసాకులు చెప్పొద్దు

Published Tue, Oct 27 2015 12:55 AM

కుంటిసాకులు చెప్పొద్దు

మీకోసంలో ఇన్‌చార్జి కలెక్టర్ ఆగ్రహం
 
మచిలీపట్నం (చిలకలపూడి) :  జిల్లా అధికారులు అబద్దాలు చెప్పకుండా మీ కోసం కార్యక్రమంలో ఇచ్చిన అర్జీల పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు జేసీ-2 ఒంగోలు శేషయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ సమావేశాలకు రావాల్సిన అధికారులు కుంటిసాకులు చెప్పకుండా మీకోసం కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. సొంత పనులపై వెళుతూ కిందిస్థాయి సిబ్బందిని పంపి.. ప్రభుత్వ సమావేశాల్లో ఉన్నామని చెప్పించడం సబబు కాదన్నారు. సమావేశాలు లేకపోయినా సమావేశంలో ఉన్నామని చెబుతూ ఏ వివరాలు తెలియని సిబ్బందిని పంపి అర్జీలు ఎలా పరిష్కరిస్తారని  ప్రశ్నించారు.

మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు సమావేశానికి హాజరుకాకుండా సూపరింటెండెంట్‌ను పంపడం, సమస్యలపై అర్జీదారులు ఇచ్చే వినతులకు ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇన్‌చార్జి కలెక్టర్ గెటవుట్ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సమావేశానికి హాజరైన మత్స్యశాఖ డీడీ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పటం ఇన్‌చార్జి కలెక్టర్‌కు విస్మయం కలిగించింది. జిల్లా అధికారులు మీ కోసంలో వచ్చిన అర్జీలు పరిశీలించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, పరిష్కారశాతం పెరగాలని సూచిం చా రు. స్మార్ట్‌విలేజ్ కార్యక్రమంలో భాగంగా కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ప్రత్యేకాధికారి పర్యటించినప్పుడు అంగన్‌వాడీ కేంద్రం మూసివేసి ఉండడం, పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆయన నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా ఇన్‌చార్జి కలెక్టర్ ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారిని ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.ు సీడీపీవోకు పంపి విచారణ చేయమని ఆదేశాలిచ్చానని  తెలిపారు.  జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీఎస్‌వో వి.రవికిరణ్, డీఆర్డీఏ పీడీ వి. చంద్రశేఖరరాజు, డ్వామా పీడీ మాధవీలత, డీఈవో ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement