సంగోరు రాత్రేళ.. మృత్యు హేల! | Sakshi
Sakshi News home page

సంగోరు రాత్రేళ.. మృత్యు హేల!

Published Fri, Jul 18 2014 3:04 AM

సంగోరు రాత్రేళ.. మృత్యు హేల! - Sakshi

బూర్జ, ఆమదాలవలస: సంగోరు రాత్రి గడిసింది. అంతలోనే పెద్ద శబ్దంతో గోడ కూలిపోనాది. మా బతుకులను కూల్చేసినాది. అని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన సెలగల పెంటయ్య కుటుంబ సభ్యులు విలపించారు. గురువారం వారిని పరామర్శించేందుకు కొల్లివలస వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంఘటన వివరాలు తెలుసుకుని వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు, జగన్ మధ్య సంభాషణ ఇలా సాగింది.
 
 జగన్: ప్రమాదం ఎలా జరిగింది?
   నాగరాజు: (పెంటయ్య కుమారుడు, ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు) శనివారం పనిచేశాం. పేమెంట్ అందుకున్నాం. అన్నం తినేసాం. గుడిసెల్లోకి ఎళ్లి పడుకున్నాం. సంగోరు రాత్రిలో 20 అడుగుల గోడ ఒక్కసారి పెద్ద శబ్డంతో కూలిపోయింది.
 
 జగన్: అప్పుడు ఎంత మంది ఉన్నారు?
 నాగరాజు: మొత్తం 12 మందిపైన పడింది. అందరూ
 సనిపోయారు. నేనే మిగిలాను. బుర్రకు దెబ్బ తగలడంతో 5 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను.
 
 జగన్: చెన్నైకే ఎందుకు పనికి వెళ్తున్నారు?
 పెంటమ్మ(మృతుని భార్య): నాకు ఇద్దరు పిల్లలు బాబు. సిన్నోడు మూడు చదివినాడు, పెద్దోడు సదవలేదు. మేస్త్రీ పనిచేస్తున్నాడు. మండలంలో ఉపాధి పనులు జరగడంలేదు. రెండు పూటలా పనికెళ్తే వందలోపే వస్తాంది. ఎటుకీ చాలడంలేదు. అందుకే ఏటా పనికెల్తాం. ఈసారి అదే కొంప ముంచింది. భర్తను మృత్యువు తీసుకుపోరుుందంటూ కన్నీరు పెట్టింది.
 
 జగన్: గోడ ఓనరుపై కేసు వేయగలరేమో కనుక్కోండి. పార్టీ తరఫున తమ్మినేని సీతారాం మీ వెంట ఉంటారు. ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడి యజమాని నుంచి మీకేమైనా వచ్చేందుకు మా ప్రయత్నం చేస్తాం?
 పెంటమ్మ: అలాగే బాబూ, అక్కడ చేసిన పనికి స్లిప్పులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇవ్వలేదు.
 
 జగన్: నాగరాజూ చదువుకుంటావా?
 నాగరాజు: చదవలేను.
 
 పెంటమ్మ: విడో పింఛన్ ఇప్పించండి బాబూ..
 జగన్: వచ్చేలా చూస్తానమ్మా. కొత్తగా పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా?
 బాధితులు: లేవు బాబూ.. అన్నీ నాన్న వై.ఎస్. పెట్టినవే ఉన్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement