వైఎస్ అంటే ఓ భరోసా... | Sakshi
Sakshi News home page

వైఎస్ అంటే ఓ భరోసా...

Published Thu, Jul 9 2015 4:01 AM

Y S Rajasekhara Reddy on birth anniversary

అభివృద్ధికి, సంక్షేమానికి నిలువెత్తు
 నిదర్శనం ఆయన
 రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన
 ఆపద్భాంధవుడు
 కుల, మత, వర్గాలకు అతీతంగా సంక్షేమపథకాలందించిన మహానేత
 వైఎస్ జయంతి సభలో
 వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన

 
 శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తానున్నానంటూ భరోసా, ఆత్మవిశ్వాసం కల్పించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ జయంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వై.ఎస్.బాధ్యతలు చేపట్టిన తర్వాత సమాజానికి, తెలుగుప్రజలకు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుని ఆయన జన్మదినాన్ని ప్రజలంతా పండగలా జరుపుకుంటున్నారన్నారు. అనేక అసమానతలు కలిగిన సమాజంలో తెలుగు ప్రజల అవసరాలు గుర్తించి వారి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆరున్నరేళ్ళ పాటు ప్రజారంజకంగా సంక్షేమపథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
 
  పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలపాలిట ఆపధ్భాంధవునిలా నిలిచారన్నారు. వైఎస్‌ను ఆదర్శంగా తీసుకుని దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకే అధికారం కట్టబెట్టి ఇటు ప్రభుత్వ అధికారులకు, అటు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందజేయకుండా వారి పొట్టలు కొడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికి, మహిళల సాధికారతకు, నిరుపేదవిద్యార్థులకు ఉన్నత విద్య అందించారనీ, బడుగు, బలహీన వర్గాలను ఆదుకుని వారి సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టారనీ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసి జనహృదయనేతగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
 
 పార్టీ కేంద్రకార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతు అభివృద్ధీ ధ్యేయంగా దివంగత వైఎస్ పనిచేసి రైతుబాంధవునిగా పేరుపొందారన్నారు. కార్యక్రమానికి ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు శిమ్మ రాజశేఖర్, చల్లా రవికుమార్, పార్టీ గ్రీవెన్స్‌సెల్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, పార్టీ నాయకులు వై.వి.సూర్యనారాయణ, ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, సాధు వైకుంఠరావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, ఎన్ని ధనుంజయ్, బల్లాడ జనార్దనరెడ్డి, జి.టి.నాయుడు, పొన్నాడ రుషి, రావాడ జోగినాయుడు, ఎం.వి.స్వరూప్, తంగుడు నాగేశ్వరరావు, జె.ఎం.శ్రీనివాస్, టి.కామేశ్వరి, అబ్దుల్ రెహమాన్, కోరాడ రమేష్, పాలిశెట్టి మధుబాబు, సుంకరి కృష్ణ, అలపాన త్రినాథరెడ్డి, నక్క రామరాజు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement