Sakshi News home page

మీరే పోస్టల్ స్టాంపు డిజైన్ చేయొచ్చు

Published Thu, Sep 25 2014 1:46 AM

You will have to switch stamp, designed by a design

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తపాలా శాఖ నిర్ణయం
‘క్లీన్ ఇండియా’ అంశంపై పోస్టల్ స్టాంపు డిజైన్‌కు ఆహ్వానం


హైదరాబాద్: మీరు రూపొందించిన ఓ డిజైన్ పోస్టల్ స్టాంపుగా మారితే ఎలా ఉంటుంది...! అలాంటి అరుదైన అవకాశాన్ని తపాలా శాఖ కలిగిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాంపు డిజైన్ పోటీ నిర్వహిస్తోంది. ‘క్లీన్ ఇండియా’ అంశం ఇతివృత్తంగా ఈ పోటీ ఉంటుంది. ఔత్సాహికులు ఈ అంశం ప్రతిఫలించేలా డిజైన్ రూపొందించి పంపాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అలా వచ్చిన వాటిని పరిశీలించి మూడింటిని ఎంపిక చేస్తారు. వాటికి నగదు బహుమతితోపాటు ఆ డిజైన్‌ను స్టాంపుగా చెలామణి చేస్తారు.

మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.6 వేలు అందజేస్తామని తపాలా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నమూనాలను ఏ- 4 సైజులో స్పీడు పోస్టులో ‘ ఏడీజీ (ఫిలాటెలీ), రూమ్ నంబర్ 108(బి), డాక్ భవన్, పార్లమెంటు స్ట్రీట్, న్యూఢిల్లీ-110001 చిరునామాకు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబరు 15లోపు అవి అందాలని, ఇతర వివరాలకు తమ వెబ్ సైట్‌ను సంప్రదించాలని తపాలాశాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ సూచించారు.
 
 

Advertisement
Advertisement