ఎలుకలు తెచ్చిన ఉపద్రవం!

8 Nov, 2019 09:51 IST|Sakshi

–కరెంటు షాక్‌తో యువతి మృతి

చిత్తూరు, గుడుపల్లె : కరెంటు షాక్‌కు గురై యువతి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని అగరం జ్యోగిండ్లులో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన సరోజ(19) కరెంటు స్తంభానికి కట్టిన కమ్మీలపై దుస్తులు ఆరవేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఎలుకలే ఆమె మృతికి కారణమయ్యాయని పరిశీలనతో తేలింది. అసలేం జరిగిందంటే..కరెంటు స్తంభానికి అమర్చిన స్విచ్‌ బాక్సులోని తీగలను ఎలుకలు ఇష్టానుసారంగా కొరికివేశాయి. దీంతో ఆ స్తంభానికి కరెంటు సరఫరా అవుతున్నా ఎవరూ గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఉతికిన దుస్తులు అక్కడి కమ్మీపై సరోజ ఆరవేస్తున్న సమయంలో స్తంభం నుంచి కమ్మీలోకి సైతం కరెంటు సరఫరా కావడంతో షాక్‌ కొట్టి, మృత్యువాత పడింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు