తనిష్క్ లో చోరీ చేసింది కిరణే:సీపీ | Sakshi
Sakshi News home page

తనిష్క్ లో చోరీ చేసింది కిరణే:సీపీ

Published Mon, Jan 27 2014 3:30 PM

తనిష్క్ లో చోరీ చేసింది కిరణే:సీపీ - Sakshi

హైదరాబాద్: తనిష్క్ బంగారం దుకాణంలో చోరీ చేసింది కిరణ్ అనే యువకుడని  సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వికలాంగుడిగా నటించాడని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దుకాణంలో కి ప్రవేశించిన అనంతరం లైట్లను ఆఫ్ చేసి చోరీకి పాల్పడ్డారన్నారని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ లో ఉన్న మరోవ్యక్తి కిరణ్ రూమ్ మేట్ గా తేలిందన్నారు. అతని పేరు ఆనంద్ అని కిరణ్ తెలిపాడన్నారు. ఈ ఘటనలో రూ. 23 కోట్ల విలువైన 30 కిలోల బంగారం చోరీకి గురయిందన్న యాజమాని ఫిర్యాదుతో దర్యాప్తు ఆరంభించామన్నారు.

 

ప్రస్తుతం 5.98 కోట్ల విలువైన 15.97 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. నగల దుకాణం యజమాని చెప్పినట్లు చోరీ గురయిన ఆభరణాల విలువ రూ.23 కోట్లు ఉండదన్నారు. చోరీకి పాల్పడిన విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. 24 వ తేదీ అర్ధరాత్రి దుకాణానికి కన్నం పెట్టి చోరీ చేసారన్నారు. చోరీ చేసే సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించారన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదన్నారు. ఆభరణాలను రసూల్ పూర్ లో దాచినట్లు సీపీ తెలిపారు. కాగా బంగారంలోంచి ఒక ఉంగరాన్ని విక్రయించరన్నారు.ఈ చోరీతో సంబంధమున్న ఆనంద్ అనే వ్యక్తి ఇంకా దొరకలేదన్నారు.

 

గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement