బాలికపై యువకుడి అత్యాచారయత్నం | Sakshi
Sakshi News home page

బాలికపై యువకుడి అత్యాచారయత్నం

Published Sat, Nov 7 2015 8:40 PM

Youth attempts rape on 7 years old girl

విశాఖపట్నం: ఒంటరిగా ఉంటున్న ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా ఆరిలోవ మండలం జైభీంనగర్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా శానిటేషన్ కార్మికుడిగా పనిచేసే కిరణ్(21) అదే వీధిలో ఉండే ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక(7)పై అత్యాచారానికి యత్నించాడు.

కూలి పనులకు వెళ్లి రాత్రి వేళకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని బాధితురాలు వెల్లడించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement