పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు!

8 Jul, 2015 18:21 IST|Sakshi
పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు!

విశాఖపట్నం: సైన్యంలో చేరి భరతమాతకు సేవ చేద్దామనుకున్నాడు. పరుగు కూడా విపరీతంగా ప్రాక్టీసు చేశాడు. ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీకి వచ్చి, పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ పోటీ ముగిసిన వెంటనే అక్కడే సొమ్మసిల్లి పడిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం విశాఖపట్నంలో జరిగింది.


వివరాలు... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత మొదటి స్థానంలో నిలిచిన నీలబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆ అభ్యర్థిని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం సమయంలో నీలబాబు ప్రాణాలు కోల్పోయాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా