276వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 2 2018 9:09 AM

YS Jagan 276th Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, విజయనగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 276వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని కొత్తపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి సంకేటి వీధి, కుమ్మరి వీధి, వైఎస్సార్‌ నగర్‌, కొండకరకాం వరకు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ వైఎస్‌జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొండవెలగాడ వరకు ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.


గాంధీజీకి నివాళి అర్పిస్తున్న వైఎస్ జగన్‌.

మహాత్ముడికి వైఎస్‌ జగన్‌ నివాళి
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. విజయనగరంలోని పాదయాత్ర శిబిరంలో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేశారు.

     

Advertisement
Advertisement