ఘనంగా జగన్ జన్మదిన వేడుక | Sakshi
Sakshi News home page

ఘనంగా జగన్ జన్మదిన వేడుక

Published Mon, Dec 22 2014 1:11 AM

ys jagan birthday grand celebrations at rajamundry

* జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు
* పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు

 సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించాయి. నియోజక వర్గాల వారీగా నేతలు కేక్‌లు కట్ చేసి అందరికీ పంచారు. అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనపర్తి నియోజకవర్గం కుతుకులూరులో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని బర్త్‌డే కేక్ కట్ చేసి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పంచారు. రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, మండల యువత కన్వీనర్ కర్రి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న సాయిబాబా ఆలయంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,  కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నేత ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు, పార్టీ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ధవళేశ్వరం పలుకు ఆశ్రమ పాఠశాలలో చెవిటి, మూగ విద్యార్థులతో కేక్ కట్ చేయించి, పంచారు.

కడియం బీసీ హాస్టల్‌లో పార్టీ నాయకుడు గిరజాల బాబు కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచారు. మండపేటలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభి రామయ్యచౌదరి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, రెడ్డి రాధాకృష్ణ, బిక్కవోలులో అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి కార్యక ర్తలకు పంపిణీ చేశారు. రామచంద్రపురంలో పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు యనమదల గీత దంపతులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, సుమారు 350 మంది రోగులకు రూ.50 వేల విలువైన మందులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్‌చేసి ‘జగన్ జిందాబాద్’ అని నినదించారు.
 
వికలాంగుల పాఠశాలలో..
కాకినాడలో పార్టీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు ఆర్.వి.జె.ఆర్ కుమార్ ఆధ్వర్యంలో బులుసు సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో వేడుకలను జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు లింగం రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఠాపురంలో పార్టీ  కార్యాలయంలో   రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, పిఠాపురం మున్సిపాలిటీలో పార్టీ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబి తదితరులు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ఏలేశ్వరంలో పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
 
కోనసీమలో...
జగన్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో పార్టీ పట్టణ యూత్ కన్వీనర్ గనిశెట్టి రమణ్‌లాల్ ఆధ్వర్యంలో చెవిటి మూగ పాఠశాలలో కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పళ్లు పంపిణీ చేశారు.  అల్లవరంలో మండల కన్వీనర్ పశ్చిమాల శ్రీనివాసరావు, ఉప్పలగుప్తంలో మండల కన్వీనర్ నిమ్మకాయల హనుమంతు శ్రీనివాసు, ఎంపీపీ శిరంగు రాజా, డీసీసీబీ డెరైక్టర్ దంగేటి దొరబాబు తదితరులు పుట్టిన రోజును వేడుకగా నిర్వహించారు. మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అంబాజీపేటలో జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు,  పి.గన్నవరంలో పార్టీ నేత విప్పర్తి వేణుగోపాలరావు  తదితర నాయకులు కేక్ కట్ చేశారు. సామర్లకోటలో మాజీ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. ముమ్మిడివరంలో పార్టీ మండల కన్వీనర్ జగతా బాబ్జి, ఫ్లోర్ లీడర్ కాశి బాల మునికుమారి, ఇతర నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు.
 
లోటస్ పాండ్‌లో జిల్లా నేతలు
హైదరాబాద్‌లోని జగన్‌మోహన్‌రెడ్డి నివాసం లోటస్ పాండ్‌లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా నేతలు పాల్గొని వికలాంగులకు, అంధులకు రగ్గులు పంపిణీ చేశారు. శాసన సభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయభాస్కర్, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి తదితర జిల్లా నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement