ఏప్రిల్‌ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ

Published Fri, Mar 20 2020 2:53 PM

YS Jagan Decides Post Pone Distribution Of House Sites - Sakshi

సాక్షి, తాడేపల్లి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఉగాది రోజున ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నా, కరోనా వైరస్ ప్రమాదం నివారణ చర్యల్లో భాగంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.  చదవండి: భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి

Advertisement

తప్పక చదవండి

Advertisement