వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఎదురుచూసి మోసపోయిన రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచేందుకే ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ప్రతిపక్ష నేత నిరాహారదీక్షకు పూనుకుంటున్నారని ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారని టీడీపీ మంత్రులు, నేతలు ఏమీ తెలియనట్లు నటిస్తూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఎన్నికల సమయంలో ప్రకటించి ఆ తరువాత మోసగించడంతో గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. డ్వాక్రా రుణాలు రద్దు కాకపోవడంతో మహిళా సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు. చంద్రబాబు చేసిన నమ్మకద్రోహంపై ప్రజలను జాగృతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేతిలో ప్రజలు మోసపోయినపుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ముందుండి పోరాడుతుందనే విషయం తాము రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.
‘‘ఎన్నికల నాటికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు, డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14 వేల కోట్లు. ఈ రెండింటిపై వడ్డీ సుమారు మరో రూ. 14 వే ల కోట్లు. ఇవన్నీ కలిపితే రూ. 1.14 లక్షల కోట్లు అవుతాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం ఇంత భారీగా ఉంటే టీడీపీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కేవలం రూ. 5 వేల కోట్లు. అందులోనూ ఇప్పటికి విడుదల చేసింది రూ. 3,900 కోట్లు మాత్రమే. ఇది వడ్డీ మొత్తంలో సగానికి కూడా సరిపోదు. బాబు మోసంపై ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేతగా జగన్ ఈ దీక్ష చేస్తున్నారు. తన దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, టీడీపీ చేసిన వాగ్దానాలను మళ్లీ వారికి గుర్తు చేయాలన్నదే ఆయన సంకల్పం’’ అని ధర్మాన చెప్పారు.
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
రైతు రుణాలు మాఫీ కాకపోవడం వల్ల బ్యాంకుల నుంచి వారికి అప్పులు ఇచ్చే వ్యవస్థ కుప్పకూలిందని, ఫలితంగా రుణాల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పులు పుట్టక, బీమా సౌకర్యం లేక కనీసం మద్దతుధర లభించక రైతులు దిగాలు పడి గ్రామాల్లో కూర్చుని ఉంటే చంద్రబాబు దావోస్, జపాన్ గురించి చెబుతూ వారిని రంగుల లోకంలో విహరింప జేయాలని చూస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. మంత్రులు జగన్ దీక్ష గురించి ఏం మాట్లాడినాగానీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతునివ్వాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు.
మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష
Published Thu, Jan 29 2015 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement