విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి: జగన్‌ | Sakshi
Sakshi News home page

విశ్వబ్రాహ్మణులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ

Published Wed, May 2 2018 5:28 PM

YS Jagan Interaction with Viswabrahmins At Potlapalem  - Sakshi

సాక్షి, మచిలీపట్నం : ప్రజాసంకల్పయాత్రలో భాంగా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం పొట్లపాలెంలో విశ్వబ్రాహ్మణులతో ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు తమ సమస్యలను...రాజన్న తనయుడికి విన్నవించుకున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, సామాజికంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కులాలు తమవని, ఆదుకోవాలంటూ వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్‌ను పునరుద్దరిస్తామని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో నంబర్‌ 23 అమల్లో ఉండేదని, అప్పుడు కార్పొరేషన్‌ ఉన్నదానిని చంద్రబాబు ప్రభుత్వం ఫెడరేషన్‌గా మార్చేసింది. అదేవిధంగా జీవో 272 వైఎస్‌ఆర్‌ హయాంలో ఉండేది. 272 జీవో వల్ల వేధింపులకు గురికాకుండా రక్షణగా ఉండేది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో విశ్వబ్రాహ్మణుల తరఫు నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా చూస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement