జగన్ కృషివల్లే దేశవ్యాప్త చర్చ | Sakshi
Sakshi News home page

జగన్ కృషివల్లే దేశవ్యాప్త చర్చ

Published Thu, Dec 12 2013 12:47 AM

జగన్ కృషివల్లే దేశవ్యాప్త చర్చ - Sakshi


 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పట్ల కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గమైన చర్యలపై జాతీయస్థాయిలో చర్చ జరిగే పరిస్థితులు తీసుకురావడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సఫలీకృతులయ్యారని ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను దుర్వినియోగపరుస్తూ రాజకీయలబ్ధి కోసం రాష్ట్రాలను బలహీనపరుస్తున్న కేంద్రం చర్యలను వివరించి, విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతును జగన్ కూడగట్టగలిగారని తెలిపారు.

 

జగన్ కృషి వల్లే నేడు మెజారిటీ పార్టీలు విభజనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాఖ్యను ఛిన్నాభిన్నం చేసే విభజన ప్రక్రియను నిలుపుదల చేయాల్సిన ఆవశ్యకతను జగన్ అన్ని పార్టీలకు వివరించారని చెప్పారు. భవిష్యత్తులోనూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారు రాష్ట్రాలను విభజిస్తూ, రాష్ట్ర నాయకత్వాలను బలహీనపరుస్తారని, తద్వారా దేశం అభద్రతలోకి వెళ్లే ప్రమాదముందని తెలియజేశారన్నా రు. ఆర్టికల్-3ను సవరించి పార్లమెంటు, అసెంబ్లీలో మూడిం ట రెండొంతుల మెజారిటీ ఉంటే విభజన ప్రక్రియ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని, దీనిపై అన్ని పార్టీల్ని సమాయత్తపరిచి ఒక జాతీయ అంశంగా ప్రాధాన్యం సంతరించుకునే లా చేయడంలో జగన్ విజయవంతమయ్యారని తెలిపారు.
 
 విభజనకు సహకరిస్తున్న అజ్ఞాతపుత్రుడు, సీఎం
 
 సోనియాగాంధీకి అజ్ఞాతపుత్రుడుగా మారిన చంద్రబాబు రాష్ట్రవిభజనకు అన్నిరకాలుగా సహకరిస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. రోజూ ప్రెస్‌మీట్ పెట్టి ‘రెండుకోతులు- పిల్లి పంచాయితీ’ ‘కొబ్బరిచిప్పలు’ ‘ఇద్దరు కొడుకులు’ అంటూ ఏవేవో మాట్లాడుతున్న చంద్రబాబు... 75 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు విభజనను ఆపమని ఒక్క మాటచెప్పట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన బాబు సమైక్యంగా ఉంచమని ఒక్క లేఖ కూడా రాయట్లేదన్నారు. విభజనను త్వరితగతిన పూర్తిచేయడం కోసం కాంగ్రెస్‌కు అడుగడుగు నా సహకరిస్తున్నారన్నారు. మరోవైపు సీఎం కిరణ్ వారానికొక ప్రెస్‌మీట్ పెట్టి దొంగ ఏడుపులు తప్పితే విభజనను అడ్డుకోవడానికి చేసిందేంటని ప్రశ్నించారు. ఇప్పటికీ అసెం బ్లీలో ఓటింగ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. విభజనకు దోహదపడి తర్వాత కొత్త పార్టీపెడితే చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని కిరణ్‌ను హెచ్చరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement