199వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

26 Jun, 2018 08:13 IST|Sakshi

సాక్షి, అమలాపురం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు.

అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్‌ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం రాజన్న బిడ్డ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కొంకపల్లి, అమలాపురం వరకు 199వ రోజు పాదయాత్ర సాగనుంది. అమలాపురంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు