అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్

Published Sat, Apr 22 2017 8:09 PM

అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్ - Sakshi

సోషల్ మీడియాను అణగదొక్కుతున్న చంద్రబాబు మీద అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోరాటం చేయాలని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులంతా ఈ దారుణంపై స్పందించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.

సోషల్ మీడియా మీద ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న అసహనం, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. పొలిటికల్ పంచ్ అనే ఫేస్‌బుక్ పేజీ అడ్మినిస్ట్రేటర్ అయిన రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, తర్వాత వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంలో సోదాలు చేయడం, అక్కడి సిబ్బందికి నోటీసులు ఇవ్వడం తదితర ఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని, సర్కారు నిరంకుశ వైఖరిపై ధ్వజమెత్తాలని వైఎస్ జగన్ కోరారు. ఏపీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను కలిసకట్టుగా వ్యతిరేకించాలని అన్నారు.

 

Advertisement
Advertisement